సెయింట్ లూయిస్ ప్రవాసుల దీపావళి హేల

సెయింట్ లూయిస్ తెలుగు సంఘం ప్రవాసాంధ్రులు దీపావళి వేడుకలను నవంబర్ 14, 2015 న కన్నుల పండువగా జరుపుకున్నారు. 1100 మందికి పైగా పాల్గొన్న ఈ వేడుకలు, తెలుగు సాంప్రదాయానికి అనుగుణంగా సెయింట్ లూయిస్ కమిటీ మరియు బోర్డు మెంబెర్స్ ఈ వేడుకలను ప్రారంభించారు. నిలువెత్తు శివ లింగం, ఇంద్ర లోకం, పల్లెటూరు ఇల్లు, నెమలి , నర్తకీమణులు లతో ఎంతో అందంగా అలంకరించిన వేదికపై సెయింట్ లూయిస్ తెలుగు సంఘం సభ్యులు ప్రదర్శించిన సాంసృతిక కార్యక్రమాలు చూడడానికి రెండు కళ్ళు చాలవనిపించింది. TAS అద్వర్యంలో నిర్వహించిన సాంఘిక పౌరాణిక నాటకం “జ్యోతిర్గమయ” లో 60 మంది కి పైగా నటించారు. ఈ నాటకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పలు ప్రశంసలు పొందినది. ప్రేఖకులు మంత్ర ముగ్ధులై కేరింతలతో ఉత్సాహంగా అలరించారు. సెయింట్ లూయిస్ తెలుగు సంఘం సాంస్కృతిక కార్యదర్శి శ్రీలహరి దాస్యం కార్యక్రమాలను పర్యవేక్షించారు. తెలుగు సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ పుట్టగుంట ఈ వేడుకలను ఇంత ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ, తాము జరుపబోయే భవిష్యత్ కార్యక్రమాలను వివరించారు. సంఘం ఉపాధ్యక్షులు రవీంద్రనాథ్ కర్నాటి , కార్యదర్శి రవిరాజ్ కొలకలేటి ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి ప్రధాన పాత్ర పోషించారు. కోశాదికారి కళ్యాణ్ వుయ్యూరు సభ్యత్వ నమోదు పర్యవేక్షించారు. నోరూరించే అధ్బుతమైన వంటకాలతో కూడిన విందు భోజనంతో కార్యక్రమం ముగిసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com