సెల్ఫీ అవార్డు ఇచ్చేసుకున్నారు

ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ గతేడాది ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి కూడా తననే పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎన్నుకునే అవకాశముందని.. అయితే ఆ గౌరవం తనకు వద్దని అంటున్నారు ట్రంప్‌. ఈమేరకు ట్విటర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. డిసెంబర్‌లో టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పేరును ప్రకటించనుంది. అయితే ఇందుకు ఎవరిని ఎన్నుకుందో ఆ మ్యాగజైన్‌ చెప్పలేదు గానీ.. ఇంటర్వ్యూ, ఫొటో షూట్‌ కావాలని ట్రంప్‌ను కోరింది. దీంతో మరోసారి తననే ఎన్నుకుంటున్నారని భావించిన ట్రంప్‌.. ఆ అవార్డు తనకు వద్దని చెప్పారు. ‘గతేడాది లాగే ఈ సారి కూడా టైమ్‌ మ్యాగజైన్‌ నన్నే పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎన్నుకునే అవకాశం ఉంది. అందుకే నన్ను ఇంటర్వ్యూ, ఫొటోషూట్‌ అడిగారు. అయితే ఇందుకు నేను వద్దని చెప్పాను. ఎనీవే.. థాంక్యూ..!’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అయితే ట్రంప్‌ ట్వీట్‌కు టైమ్‌ కూడా స్పందించింది. అధ్యక్షుడు పొరబాటు పడుతున్నారని చెప్పింది. ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ను మేం ఎలా ఎంపిక చేస్తామన్న విషయంపై అధ్యక్షుడు పొరబాటు పడుతున్నారు. మా ఎంపికను ప్రకటించేంతవరకు టైమ్స్‌ దాని గురించి మాట్లాడబోదు. డిసెంబర్‌ 6న పేరును ప్రకటిస్తాం’ అని ట్వీట్‌ చేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com