స్నేహితులతోనే చేసుకుంటామంటున్న జపనీయులు

వివాహమంటే రెండు జీవితాలు ఒకటి కావడం. జీవితాంతం తోడునీడగా కలిసి బతకడం. ప్రపంచవ్యాప్తంగా వివాహాలు రెండు పద్ధతుల్లో జరుగుతుంటాయి. ఒకటి పెద్దలు ఎంపిక చేసిన భాగస్వామిని పెళ్లాడటం.. రెండోది ప్రేమించి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని వివాహమాడటం. అయితే.. ఈ రెండూ పద్ధతులు ఫాలో అయ్యేంత ఓపిక.. సమయం లేని జపాన్‌ వాసులు ఎలాంటి సంప్రదింపులు.. ప్రేమ లేకుండా స్నేహితులను.. తెలిసిన వారిని వివాహం చేసుకుంటున్నారట. జపాన్‌లో యువతీయువకులకు ప్రేమ.. డేటింగ్‌ కలిసి తిరగడాలు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వంటి అంశాలు పెద్దగా తెలియదు. ఎందుకంటే.. వారికి వారి వయసు ఉన్న వ్యక్తులతో అనుబంధాలు చాలా తక్కువ. దీంతో బయటి వ్యక్తులతో మాట్లాడటానికి చాలా మొహమాటపడతారు. దీంతో జపాన్‌లో 60శాతం అమ్మాయిలకు.. 76శాతం అబ్బాయిలకు ప్రేమించడమే తెలియదట. తూర్పు జపాన్‌లో 80శాతం యువత వివాహం కేవలం జీవితంలో ఒక ఘట్టం మాత్రమేనని భావిస్తారట. అందుకే పెద్దలు వారి పిల్లలకు భాగస్వామిని వెతకడం అంతా ఆషామాషీ వ్యవహారం కాదు. దీంతో మంచి సంబంధాలు దొరకడం గగనంగా అనిపిస్తుందట. యువతీ యువకుల డేటింగ్‌ విషయంలోనూ అనేక ఇబ్బందులు తలెత్తుతాయట. దీంతో సమయం.. డబ్బులు ఆదా అవుతాయని.. మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని చాలాకాలంగా స్నేహితులుగా ఉన్న వారినే వివాహం చేసుకుంటున్నారట.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com