స్పాట్లీ దీవిలో జామింగ్ వ్యవస్థను పరీక్షించిన చైనా

దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద స్పాట్లీ దీవుల్లో చైనా అత్యంత రహస్యంగా తన ఎలక్ట్రానికి ఆయుధాల పరీక్షలను చేపట్టింది. దీని కోసం కొన్నాళ్ల నుంచి అక్కడకు ఆయుధాలను చేరవేయడం ప్రారంభించింది. టెక్‌ ఆయుధాలను నిలువరించే జామింగ్‌ వ్యవస్థను ఇక్కడ పరీక్షించినట్లు అమెరికా అనుమానిస్తోంది. ఈ ఏడాది మొదట్లో స్పాట్లీ దీవులకు చైనా ఆయుధాలను చేరవేసింది. నెలక్రితం అక్కడ అనుసంధానించింది. ఆ తర్వాత ఆయుధ పరీక్షలను చేపట్టింది. ఈ జామింగ్‌ వ్యవస్థ సాయంతో శత్రువుల ఎలక్ట్రానిక్ ఆయుధాలు పనిచేయకుండా చేయవచ్చు. దీంతో పాటు కమ్యూనికేషన్లను, రాడార్లను కూడా దెబ్బతీయవచ్చు. వీటితో పాటు ఇప్పటికే ఇక్కడ ఏర్పాటు చేసిన చైనా సైనిక స్థావరాలకు నౌకలను విధ్వంసం చేసే క్షిపణులను, ఉపరితలం మీద నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణులను చేరవేసింది. చైనా టెక్‌ జామింగ్‌ వ్యవస్థను పరిశీలిస్తున్నట్లు అమెరికాకు చెందిన జీఎంఏ వ్యవస్థ పసిగట్టింది. దీనిని అమెరికాకు చెందిన ఎఫ్‌/ఏ-18 సూపర్‌ హర్నెట్‌ యుద్ధవిమానాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ యుద్ధ వ్యవస్థ. ఇటీవల అమెరికాకు చెందిన రెండు యుద్ధనౌకలు తైవాన్‌ మీదుగా ప్రయాణించాయి. ఈ సమయంలో అమెరికాకు చెందిన జీఎంఏ వ్యవస్థ చైనా టెక్‌ జామింగ్‌ గమనించి సమర్థంగా ఎదుర్కొంది. ఈ విషయాన్ని అమెరికా నావిదళానికి చెందిన సిబ్బంది ఒకరు తెలిపారు. దాదాపు 200 దీవుల సమూహం ఉన్న ఈ ప్రాంతం ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైంది. ఈ మార్గంలో ఏటా 3.4ట్రిలియన్‌ డాలర్ల (రూ.2.3కోట్ల కోట్లు) వ్యాపారం జరుగుతుంది. దీనిపై పట్టు సాధిస్తే ఏకంగా ప్రపంచ వాణిజ్యాన్ని చైనా శాసించగలదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com