స్పై మ్యూజియం చూసొద్దాం

గూఢచారి అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది జేమ్స్‌బాండ్‌ సినిమాలే. అందులో గూఢచారిగా జేమ్స్‌బాండ్‌ చేసే విన్యాసాలు.. పోరాటాలు అందరినీ అబ్బురపరుస్తాయి. గూఢచారి అంటే ఇలా ఉండాలని అన్నట్టుగా ఉంటుంది. జేమ్స్‌బాండ్‌లా మనమూ ఒకసారి అలాంటి విన్యాసాలు చేస్తే బాగుంటుదని చాలామంది అనుకుంటారు. అమెరికాకు వెళ్తే ఆ కోరిక నెరవేరుతుంది. అక్కడి స్పై మ్యూజియం సందర్శకులను గంట పాటు గూఢచారిగా నియమించి ఓ ఆపరేషన్‌ పూర్తి చేయమని చెబుతోంది. గూఢచారుల్ని సినిమాల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. నిజ జీవితంలోనూ అలాంటి గూఢచారులు ఉంటారు. కానీ వాళ్లు ఎలా ఉంటారు? సినిమాల్లో ఉపయోగించినట్టే వాళ్లు రహస్య పరికరాలను ఉపయోగాస్తారా? అనే విషయాలు సాధారణ ప్రజలకు తెలియదు. అందుకే అమెరికాలో తొలిసారి ప్రపంచవ్యాప్తంగా గూఢచారులు వినియోగించిన వస్తువులు.. గూఢచర్యం చరిత్రను తెలుపుతూ.. వాషింగ్టన్‌ డీసీలో ఇంటర్నేషనల్‌ స్పై మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇందులో గూఢచారులు ఎలా ఉంటారు.. ఎలాంటి వస్తువుల్ని ఎలా వినియోగిస్తారు.. వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది.. తదితర విషయాలతో ఫోటోలు.. వీడియోలు.. సినిమాలు.. వస్తువుల్ని ప్రదర్శనకు ఉంచుతున్నారు. ఇందులో రోమన్‌.. బ్రిటీష్‌ రాజుల కాలం నాటి నుంచి.. అమెరికన్‌ సివిల్‌ వార్‌.. ప్రపంచ యుద్ధాల సమయంలో గూఢచర్యం చేసిన విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు.. గూఢచర్యం గురించి క్లుప్తంగా పాఠం కూడా చెబుతారు. గూఢచారిగా మారాలనుకునే వారికోసం ‘ఆపరేషన్‌ స్పై’ పేరుతో ఒక సాహస ప్రొగ్రామ్‌ను పెట్టారు. గంటపాటు సందర్శకుడు ఏజెంట్‌గా నియమితుడవుతాడు. ఆ తర్వాత వాళ్లు చెప్పిన విధంగా దారుల్లో ఉండే ఆధారాలు సేకరిస్తూ.. మిషన్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. మరెందుకు ఆలస్యం మీరూ గూఢచారి అవ్వాలనుకుంటే.. సాధ్యమైతే ఓసారి ఆ మ్యూజియంకి వెళ్లిరండి మరి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com