స్మృతిని కలిసిన కేటీఆర్

హైదరాబాద్‌లో జరిగే టెక్స్‌టైల్‌ పెట్టుబడుల సదస్సుకు కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీని ఆహ్వానించినట్టు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దిల్లీ పర్యటనలో భాగంగా ఆమెను కలిసిన అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. చేనేత వస్త్రాల ఫ్యాషన్‌ ఏర్పాటుచేయాలని స్మృతి ఇరానీ సూచించారనీ, అయితే, కేంద్రం నుంచి సహకారం అందించాలని కోరినట్టు చెప్పారు. దేశ, విదేశీ జౌళి సంస్థలు, ప్రతినిధులు ఈ పెట్టుబడుల సదస్సుకు హాజరవుతున్నారని ఈ కేటీఆర్‌ చెప్పారు. ఈ సదస్సులో పలు కీలక నిర్ణయాలను ప్రకటిస్తారన్నారు. జౌళి ఉత్పత్తుల వినియోగం పెంపుపై కేంద్రమంత్రి ప్రతిపాదించారనీ, వాటికి తెలంగాణ ప్రభుత్వం మద్దతిస్తుందని కేటీఆర్‌ స్పష్టంచేశారు. వరంగల్‌ జౌళి పార్కుకు మౌలిక వసతుల కల్పనలో కేంద్ర ప్రభుత్వ సహకారం కోరినట్టు చెప్పారు. అన్ని విషయాలపైనా స్మృతి ఇరానీ సానుకూలంగా స్పందించినట్టు కేటీఆర్‌ చెప్పారు. అలాగే ఈ సదస్సుకు హాజరవుతానని కూడా ఆమె హామీ ఇచ్చారన్నారు. తెలంగాణకు వచ్చినప్పుడు అన్ని విషయాలపైనా ఆమె చర్చిస్తానన్నారని కేటీఆర్‌ తెలిపారు. సిరిసిల్లలో మెగా పవర్‌లూం క్లస్టర్‌ ఏర్పాటును బడ్జెట్‌లో ప్రస్తావించాలని ఈ సందర్భంగా ఆమెను కోరగా, ఈ విషయమై ఆర్థికశాఖకు నివేదిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. చేనేత వస్త్రాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమె అభినందించారన్నారు. నూతన ఆవిష్కరణలపై నీతి ఆయోగ్‌ సీఈవోతో తన అభిప్రాయాలను పంచుకున్నట్టు కేటీఆర్‌ చెప్పారు. ఆవిష్కరణలు, సులభతర వాణిజ్య విధానం, వ్యాపారంలో నాణ్యత పెంపుపై చర్చించామన్నారు. రాష్ట్రానికి కేంద్ర హామీల అమలుపై కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శితో చర్చించామన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com