స్లీప్ వెల్. స్లీప్ హ్యాపీ.

డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ భేటీ అనుకున్నదానికంటే అద్భుతంగా జరిగింది. ఒకరంటే ఒకరికి గిట్టని వీరిద్దరూ సింగపూర్‌ వేదికగా జరిగిన సమావేశంలో తమ మధ్య ఉన్న విభేదాలను తొలగించేందుకు యత్నించారు. భేటీ ముగియడంతో ఇద్దరూ తమ దేశాలకు తిరుగుపయనమయ్యారు. కొద్దిసేపటి క్రితమే ట్రంప్‌ అమెరికాలో దిగారట. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ..మరోసారి కిమ్‌తో తన భేటీ ఎలా జరిగిందో వివరించారు. ‘ఇప్పుడే అమెరికాకు చేరుకున్నాను. సుదీర్ఘమైన యాత్ర. నేను అధ్యక్షుడిగా ఆఫీస్‌లో అడుగుపెట్టినప్పుడు ప్రజలు ఎంత సురక్షితంగా ఫీలయ్యారో ఇప్పుడు అంతకంటే ఎక్కవగా సురక్షితంగా ఉంటారు. ఇకపై ఉత్తర కొరియా నుంచి మనకు ఎలాంటి అణు ముప్పు ఉండబోదు. కిమ్‌తో సమావేశం ఆసక్తికరంగా, సానుకూలంగా జరిగింది. ఉత్తరకొరియాకు మంచి భవిష్యత్తు ఉంది. నేను అధ్యక్షుడిగా కార్యాలయానికి రాకముందు ప్రజలంతా మనం ఉత్తరకొరియాతో యుద్ధం చేస్తామని అనుకున్నారు. ఉత్తరకొరియా నుంచి అమెరికాకు పెద్ద ముప్పు ఉందని అదే భయంకరమైన సమస్య అని మాజీ అధ్యక్షుడు ఒబామా చెప్పారు. కానీ ఇక ఆ సమస్య ఉండదు. ఈ రాత్రి హాయిగా నిద్రపోండి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు ట్రంప్‌.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com