స్వగ్రామంలో మంచినీటి ప్లాంటు ఏర్పాటు చేసిన బొబ్బా రాం

ప్రవాసాంధృడు బొబ్బా రాం గన్నవరం సమీపంలోని తన స్వగ్రామం ముస్తాబాద్‌లో ఏపీ ఎన్.ఆర్.టీ సహకారంతో మంచినీటి ప్లాంటును ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటు ప్రారంభోత్సవానికి ఏపీ ఎన్.ఆర్.టీ చైరమన్ డాక్టర్ వేమూరు రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చిన రాంను రవి అభినందించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్, ఏపీ ఎన్.ఆర్.టీ సభ్యుడు డాక్టర్ మోటూరి నిరంజన్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com