స్వతంత్రంగానే బరిలోకి దిగుతాం

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ స్వతంత్రంగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. ‘‘నవతరాన్ని, యువతరాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలనేది నా ఆలోచన. రాజకీయంగా ప్రత్యేకంగా ఎలాంటి ప్రణాళికలు ఇప్పటివరకు లేవు. 2019 ఎన్నికల్లో పూర్తి స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నా. ప్రధానంగా సామాజిక సమతౌల్యం తీసుకురావాలన్నదే ప్రధాన ఉద్దేశం.’’ అని వివరించారు. విజయవాడలో జనసేన పార్టీ సమన్వయ కార్యాలయంలో శనివారం ఆయన ఇద్దరు విలేకరులతో ఇష్ఠాగోష్టిగా మాట్లాడారు. 2019 ఎన్నికల్లో మీ వైఖరి ఎలా ఉంటుంది అని ప్రశ్నించగా అటు జగన్‌తో వెళ్లాలని, ఇటు తెదేపాతోనే ఉండాలని అనేవారు తన మద్దతుదారుల్లోనూ ఉన్నారు..అయితే, ఈసారి స్వతంత్రంగానే వెళ్లాలనేదే తన అభిప్రాయమన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తాను ఎప్పటి నుంచో మాట్లాడుతూనే ఉన్నానని, ఆ రోజు అరుణ్‌జైట్లీని ఉద్దేశించి ఆంగ్లంలో మాట్లాడటం వల్ల సరిగా చేరలేదేమోనన్నారు. మోదీని నేను ఎక్కడ విస్మరించాను? ఎక్కడ మాట్లాడకుండా ఉన్నాను? ఈ విషయంలో పూర్తిగా ప్రజల పక్షమే తీసుకుంటానన్నారు. మన నాయకులు మోదీ గురించి మాట్లాడటానికి భయపడతారు కదా.. అని వ్యాఖ్యానించారు. వెంకయ్యనాయుడిని ఎందుకు ఎవరూ విమర్శించడం లేదు అని ప్రశ్నించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com