స్వర్ణ దేవాలయ తాపడం పనులకు ఇంగ్లాండ్ నుండి సేవకులు

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గల స్వర్ణ దేవాలయంలో బంగారం తాపడం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పదిరోజుల పాటు సాగే ఈ పనులు చేపట్టేందుకు ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ నుంచి స్వచ్ఛంద సేవకుల తరలివచ్చారు. గురునానక్‌ను ఆరాధిందే వీరు 800 కిలోల స్వర్ణానికి తాపడం పనులు చేపడుతున్నారు. వీరు 1995లో కూడా ఇక్కడి తాపడం పనులు నిర్వహించారు. 2003లో కూడా స్వర్ణదేవాలయంలో ఇటువంటి కార్యక్రమాన్నిచేపట్టారు. సేవాభావంతో ఈ పనులు చేసేందుకు బర్మింగ్‌హామ్ నుంచి 35 మంది భక్తులు వచ్చారు. కాలుష్యం కారణంగా దేవాలయంలోని బంగారానికి కళ తప్పుతోంది. దీంతో నియమితకాలంలో తాపడం పనులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నపనులను బర్మింగ్‌హామ్ నుంచి వచ్చిన మహిందర్‌సింగ్ పర్యవేక్షిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com