స్వస్థలికి శరత్ మృతదేహం

అమెరికాలో ఓ దుండగుడి చేతిలో హత్యకు గురైన తెలుగు విద్యార్థి కొప్పుల శరత్‌(26) మృతదేహం బుధవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకొంది. శరత్‌కు నివాళులు అర్పించేందుకు కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు నరేందర్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజు విమానాశ్రయానికి చేరుకున్నారు. నివాళుల అనంతరం శరత్‌ మృతదేహాన్ని వరంగల్‌కు తరలించనున్నారు. శరత్‌ ఆరు నెలల క్రితం మిస్సోరి విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చేయడానికి అమెరికా వెళ్లాడు. ఆ యూనివర్సిటీలో చదువుకుంటూనే కన్సాస్‌ నగరం ప్రాస్పెక్ట్స్‌ అవెన్యూలోని జేఎస్‌ ఫిష్‌ అండ్‌ చికెన్‌ మార్కెట్‌ అనే ఓ హోటల్‌లో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు) గుర్తుతెలియని వ్యక్తి అతనిపై కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలపాలైన శరత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శరత్‌ స్వస్థలం వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌. తండ్రి రామ్మోహన్‌ హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి. తల్లి మాలతి వరంగల్‌ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో పంచాయతీరాజ్‌ శాఖలో ఈవోఆర్డీగా పనిచేస్తున్నారు.
koppula sarath body reaches india warangal hyderabad missouri indian shooting 2018

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com