స్వెట్ సెన్సేషన్

అగ్ర కథానాయిక అనుష్క టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘భాగమతి’. జి.అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో అనుష్క లుక్‌ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక చేతితో రక్తం మరక అంటిన సుత్తిని పట్టుకోగా, మరో చేయి గాయంతో రక్తమోడుతోంది. ఇక అనుష్క వెనుక గోడపై చిత్రంలో కాళ్లకు కంకణాలు, మెట్టెలు ధరించిన ఓ మహిళ కాళ్లను గొలుసులతో బంధించిన దృశ్యం కనిపిస్తోంది. ఇలా చిత్ర బృందం చాలా ఆసక్తికరంగా పోస్టర్‌ను తీర్చిదిద్దింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com