హజ్ యాత్రకు మహిళలు

హజ్‌ యాత్రకు మొహరం క్యాటగిరీ కింద మహిళలు ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక నిబంధనలతో హజ్‌ కమిటీ అవకాశం కల్పించింది. మొత్తం 500 మంది మహిళలు యాత్రకు వెళ్లే వీలుంది. 2018 హజ్‌ యాత్రకు సంబంధించి ఇప్పటికే ఎంపికైన వ్యక్తికి మొహరంగా ఉపయోగపడే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కేంద్ర హజ్‌ కమిటీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. పాస్‌పోర్టు కాపీ, ఇతర ధ్రువపత్రాల్లో వారి బంధుత్వాన్ని నిర్ధారించే అంశాలు సరిపోలాలని పేర్కొంది. హజ్‌ దరఖాస్తుతోపాటు పాస్‌పోర్టు, ఆధార్‌, చిరునామా ధ్రువపత్రాలు ఏపీ స్టేట్‌ హజ్‌ కమిటీ, 39-3-2, ఆర్‌కే ప్లాజా, మసీదు వీధి, లబ్బీపేట, విజయవాడ అనే చిరునామాకు పంపాలని వివరించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com