హనిమిరెడ్డి ఔదార్యానికి భారీగా కృతఙ్ఞతలు చాటిన సిలికానాంధ్ర–TNI ప్రత్యేకం

డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించి మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి సందర్భంగా మిల్ పిటాస్ నగరంలో సిలికానాంధ్ర కొనుగోలు చేసిన పరిపాలనా భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ భవనానికి ప్రారంభోత్సవ పూజను సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా.హనిమిరెడ్డి దంపతులు మిలియన్ డాలర్ల చెక్కును సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్ డా.కూచిభొట్ల ఆనంద్ కు అందజేశారు. ఈ పరిపాలనా భవనానికి డా.హనిమిరెడ్డి పేరును పెట్టి సిలికానాంధ్ర తన కృతఙ్ఞతను చాటుకుంది. అనంతరం హనిమిరెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హనిమిరెడ్డి ఇరువురు కుమారులు డా.విక్రంరెడ్డి, సిద్థార్థరెడ్డి, ఆయన సోదరులు లక్కిరెడ్డి జయప్రకాశరెడ్డి, సమీప బంధువు గోగులమూడి సత్యనారాయణరెడ్డి, ఇతర బంధువులు పాల్గొన్నారు. సిలికానాంధ్ర నిర్వాహకులు కొండిపర్తి దిలీప్, కొండుభట్ల దీనబాబు, చామర్తి రాజు, తనుగుల సంజీవ, రాయవరం భాస్కర్, వేటా శరత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.










More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com