హరిబాబు…నేను రెడీ

భాజపా ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు రాష్ట్రానికి కేంద్రం సాయంపై చెప్పిందే మళ్లీ చెప్పారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కేంద్రం ప్రకటించిన వాటిలో ఐదు విద్యా సంస్థల తరగతులను వర్సిటీలు, కళాశాలల్లో నిర్వహిస్తున్నామన్నారు. కర్నూలు ట్రిపుల్‌ ఐటీ క్లాసులు కాంచీపురంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఏడు జాతీయ విద్యా సంస్థలకు రూ. 9700 కోట్ల డీపీఆర్‌లు ఇచ్చారని, ఆ స్థాయిలో కేటాయింపులు మాత్రం లేవన్నారు. ఏడు జాతీయ విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం 2401 ఎకరాల భూమిని కేటాయిచిందని మంత్రి వెల్లడించారు. వివిధ జాతీయ సంస్థల మౌలిక వసతుల కోసం రూ.607 కోట్లు ఖర్చుపెట్టామని మంత్రి అన్నారు. హరిబాబు చెప్పిన లెక్కలపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. చెప్పిన హామీలు నెరవేర్చండి.. కుంటిసాకులొద్దు అని గంటా స్పష్టంచేశారు. వైకాపా అధినేత జగన్‌ ఇచ్చిన పిలుపునకు ప్రజలు నవ్వుకుంటున్నారని, ఆయన లాలూచీ రాజకీయాలు పక్కనపెట్టాలని హితవుపలికారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com