హర్షించదగ్గ నిర్ణయాలు

సాంకేతికతను వినియోగించుకొని ప్రజలకు పారదర్శక పాలనను అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విద్యార్థులు, పురపాలక శాఖ అధికారుల సహకారంతో పోస్టర్ల రహిత నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దుతామన్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి పోస్టర్లు అతికించేందుకు వీల్లేదని సీఎం విజయవాడలో స్పష్టం చేశారు. విజయవాడలోని ఈ ఉదయం దుర్గాఘాట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులపై వర్చువల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తిచేసి తీరుతామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1700 కోట్లు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు నెలవారీగా రూ.300 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలవరం ప్రాజెక్టు వద్ద క్షేత్రస్థాయిలో వాస్తవిక సదృశ్య తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఉన్నతాధికారులను అక్కడి పరిస్థితిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇంకా 6.8 లక్షల కోట్ల క్యూబిక్‌ మీటర్ల తవ్వకం పనులు కావాలన్నారు. స్పిల్‌వే పనులు కూడా వేగంగా పూర్తిచేసేందుకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. రాత్రిపూట కూడా ప్రాజెక్టు పనులను నిరంతరాయంగా కొనసాగించేలా ఫ్లడ్‌ లైట్లను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ఎక్కడికక్కడ కెమెరాలను, అవసరమైతే డ్రోన్లను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 12 సార్లు తాను క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు చెప్పారు. ఇకనుంచి నెలకోసారి పర్యటిస్తానని, వారినికొకసారి వాస్తవిక సదృశ్య తనిఖీ చేపట్టనున్నట్లు చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com