హాంగ్ కొంగ తెలుగు సమాఖ్య ఉగాది వేడుకలు

ప్రపంచ చిత్రపటంలో ఒక చిన్న బిందువు లా కనిపించే సుగంధ తీరాన తెలుగు వారు , ఉద్యోగ రిత్య వలసి వెళ్ళి నివసిస్తున్నారు. వారు తెలుగు పండుగలని కలిసి ఆనందంగా జరుపుకుంటారు. అలాగే శ్రీ విళంబి నామ సంవత్సర నామ ఉగాది పండుగని కుడా ఎంతో వైభవంగా జరుపుకున్నారు. ది హాంగ్ కొంగ తెలుగు సమాఖ్య వారందరూ ఎంతో ఆనందోత్సాహాలతో ఉగాది వేడుకలని మన తెలుగు సంస్కృతీ సాప్రదాయాలని ముందు తరాలకి అందిచ్చే విధంగా జరుపుకున్నారు . పచ్చని తోరణాలు , ఉగాది పచ్చడి , పులిహోర , దోసకాయ ముక్కల పచ్చడి, మామిడికాయ పప్పు , ముక్కల పులుసు , వంటి కమ్మనైన విందు భోజనంతో, అందమైన కూచిపూడి నాట్యాలతో, టాలీవుడ్ టమక్కులతో ,అల్లరి పిల్లల ఆటలతో ,ఆడపడుచుల అందమైన అలంకరణలతో , ముఖ్య అతిధులు శుభాశీస్సులతో కార్యక్రమం , ఒక మరపురాని తీపి జ్ఞాపకంగా రూపు దిద్దుకుంది. సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి మాట్లాడుతూ , తాము చేసిన కార్యక్రమాల వివరాలిస్తూ , ఈ సంవత్సర ఉగాది వేడుకల నుoచి ప్రతి ఏటా మన తెలుగు రాష్ట్రాలకై కొన్ని సామాజిక సేవలకు తమ సమాఖ్య తమ వంతు కృషి చేయదలచామని చెప్పారు . ఈ సంవత్సరం తాము ఐ ఫర్ ఫార్మర్స్ అనీ స్వచ్చంద సంస్థ ద్వారా మన రైతులకి మరియు వైజాగ్ లోని ఒక అంధుల పాఠశాలకి కొంత నిధులను సేకరించామని చెప్పారు . విదేశాలకి వచ్చి సంపాయిన్చుకుంటున్నారుతమ జీవితాలను మెరుగుపరచుకుంటున్నారు. మన దేశ ప్రజలకి కూడ ఏదైనా చెయ్యాలనే నకల్పంతో తమ సభ్యులు ఆనందంగా ముందుకువచ్చి చేస్తున్నారని చెప్పారు. చిన్ని చిన్ని అడుగులు వేస్తూ ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య కృషి చేస్తోంది. హాంగ్ కాంగ్ తెలుగు వారందరూ , ఇక్కడ స్థానికంగ జరిగే భారతీయ పండుగల వేడుకలలో మరియు చైనీస్ వారి పండుగలు కూడా అంతే ఉత్సాహంగ పాల్గొంటారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com