హిందీ పార్టీ కాదని నిరూపించారు

వారణాసిలో ఫ్లైఓవర్‌ కూలి 12 మందికిపైగా మృత్యువాత పడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల్లో అధికసీట్లు సాధించి ఏకైక పెద్ద పార్టీగా భాజపా అవతరించిన నేపథ్యంలో దిల్లీలో ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘కర్ణాటకలో సరైన వ్యూహంతో పాటు కార్యకర్తల కఠోర శ్రమవల్లే విజయం సాధ్యమైంది. వారణాసి ప్రమాదం తీవ్రమైన బాధ కల్గించింది. వారణాసి ప్రమాదంతో కర్ణాటక విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. భాజపాను ఇప్పటివరకు హిందీ భాష పార్టీ అనేవాళ్లు. గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, అసోం ఇవేవీ హిందీ భాష రాష్ట్రాలు కావు. ఇప్పుడు కర్ణాటక ఈ అపవాదు తప్పని మరోసారి నిరూపించింది. కొన్ని పార్టీలు స్వలాభం కోసం రాష్ట్రాలు, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేశాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య గొడవలతో సమాఖ్య విధానానికి నష్టంకల్గించాయి. గతంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆ రాష్ట్ర భాష రాదని ఎగతాళి చేసేవారు. కర్ణాటక ప్రజలు ఎలాంటి భేదభావాలు లేకుండా నన్ను ఆదరించారు. ఈ దేశంలో మూలమూలనా దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవారు ఉన్నారు. భాష, జాతి, మతం, కులం అన్నింటినీ అధిగమించి దేశం కోసం పరిశ్రమిస్తున్నారు. ఏ పని మొదలు పెట్టినా 2019 ఎన్నికలతోనే జోడిస్తున్నారు. ఎన్నికలు వేరు.. దేశం వేరు అనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. కర్ణాటకలో భాజపా విజయం కోసం పరిశ్రమించిన కార్యకర్తలకు వేలవేల ప్రణామాలు’’ అని మోదీ అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com