హింస వద్దు

ఐపీఎల్‌ మ్యాచ్‌ అడ్డుకోవాలని చెన్నైలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ ఆవేదన వ్యక్తంచేశారు. కావేరీ జలాల సమస్యకు హింసాత్మక ఆందోళనలు పరిష్కారం కావని ఆయన పేర్కొన్నారు. నిన్న చెన్నైలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌ సమయంలో తీవ్ర ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని రాజకీయ నాయకులు, కార్యకర్తలు స్టేడియం వద్ద ఆందోళనలకు దిగారు. వారి నిరసనలు హింసాత్మకంగా మారాయి. జెర్సీలను దగ్ధం చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు ఓ పోలీసును కొడుతున్న వీడియోను రజనీ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇలాంటి ఆందోళనలు దేశానికి నష్టాన్ని చేకూర్చుతాయని, పోలీసులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకమైన చట్టాలు ఉండాలని రజనీకాంత్‌ డిమాండ్‌ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com