హెచ్1బీ అక్రమాలు.తెలుగువారి సంస్థపై అమెరికా నిషేధం


హెచ్‌-1బి వీసాలకు దరఖాస్తు చేయడానికి అవకాశం లేని 15 కంపెనీల జాబితాను అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లేబర్‌ ఇటీవల విడుదల చేసింది. ఈ కంపెనీలు చెల్లిస్తున్న వేతనాలు, పనిగంటలను లెక్కించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా హెచ్‌-1బి నిబంధనలను ఉల్లంఘించాయని అధికారులు తేల్చారు. వీరిపై ఐదేళ్ల వరకు నిఘా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కంపెనీల్లో అజెల్‌ టెక్నాలజీస్‌ ( శ్రీనివాస్‌ అరికట్ల), టెక్‌వైర్‌ టెక్నాలజీస్‌( ప్రతీక్‌ బంగ్‌, ప్రీతీ బక్షి)లు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం ఏటా 65వేల హెచ్‌-1బి వీసాలను జారీ చేస్తుంది. ఒకప్పుడు వీటిని లాటరీ విధానంలో కేటాయించేవారు. కానీ ట్రంప్‌ ప్రభుత్వం ఇటీవల ఈ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. వేలాది మంది భారతీయులు , చైనా వాసులు ఈ వీసాలపై ఆధారపడి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com