హైకోర్టు మొట్టికాయలు

హిందూయేతర్లు తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ దేవస్థానం పరిధిలోని దేవాలయాల్లో ఉద్యోగం చేయడానికి వీల్లేదనే కారణంతో పలువురు ఉద్యోగులకు ఈవో సంజాయిషీ నోటీసులు ఇవ్వడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇన్నేళ్లు సర్వీసు అందించిన వాళ్లను ఉద్యోగం నుంచి తీసేస్తామనడం అన్యాయమని వ్యాఖ్యానించింది. ఉద్యోగం నుంచి తొలగించి వారి కడుపు కొడతారా? అంటూ ప్రశ్నించింది. ఉద్యోగ ప్రకటన జారీచేసినప్పుడు ఆ ఉద్యోగాలకు హిందూయేతర్లు అనర్హులని పేర్కొననప్పుడు.. ఇప్పుడెలా వారిని తొలగిస్తారని అడిగింది. డ్రైవర్లు, అటెండర్లు, తోటమాలిలు, పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే వాళ్లను హిందూయేతర్లన్న కారణంతో తొలగిస్తామనడం ఎంతమాత్రం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఉద్యోగ ప్రకటనలో హిందూయేతర్లకు తావులేదని పేర్కొనని అప్పటి ఈవో, దిగువ స్థాయి బాధ్యులైన అధికారులపై ముందు చర్యలు తీసుకోండి, ఆ తర్వాతే పిటిషనర్ల గురించి ఆలోచించండి అని వ్యాఖ్యానించింది. వచ్చే బుధవారం వరకు పిటిషనర్ల వ్యవహారంలో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయొద్దని తితిదే ఈవోను ఆదేశిస్తూ.. పూర్తి వివరాలు సమర్పించేందుకు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com