హైదరాబాద్ మెట్రో ప్రారంభం. రేపటి నుండి ప్రజలకు అందుబాటులోకి.

భాగ్యనగర వాసులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. ఎన్నో ప్రత్యేకతలు కలబోసుకున్న హైదరాబాద్‌ మెట్రోరైల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం జాతికి అంకితమిచ్చారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మియాపూర్‌ చేరుకున్న ప్రధాని ముందుగా మెట్రో పైలాన్‌ ఆవిష్కరించి అనంతరం మెట్రోరైలును ప్రారంభించారు. అనంతరం మెట్రో స్టేషన్‌ మొదటి అంతస్తుకు చేరుకున్న ప్రధాని ప్రాజెక్టు, నగర పునఃనిర్మాణంపై దృశ్య, శ్రవణ ప్రదర్శనను తిలకించారు. టీ-సవారీ యాప్‌, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం రెండో అంతస్తులోని ప్లాట్‌ఫాంకు చేరుకుని మెట్రో రైలు ఎక్కారు. రైలులో ఆయన కూకట్‌పల్లి వరకు వెళ్లి తిరిగి మియాపూర్‌ చేరుకున్నారు. మోదీ వెంట తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు మహమూద్‌ అలీ, కేటీఆర్‌, నాయిని, పద్మారావు, భాజపా నేతలు డా.లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి తదితరులు మెట్రోలో ప్రయాణించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com