హైదరాబాద్ వాసులకు మెట్రో వలన ఒరిగింది శూన్యం!

మెట్రోరైలు వేగం పెరిగితే ఎంత సమయం ఆదా కావొచ్చు? ప్రయాణికులు మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు. ప్రస్తుతానికంటే కొంచెం ముందుగా గమ్యస్థానం చేరుకుంటారు. నాగోల్‌ నుంచి అమీర్‌పేటకు ప్రస్తుతం 40 నిమిషాలు పడుతోంది. వేగం పెంచడం ద్వారా 33 నిమిషాలకు తగ్గనుంది. 17 కి.మీ. ప్రయాణంలో ఏడు నిమిషాల సమయం ఆదా కానుంది. వేగం పెంచి నడిపే ప్రక్రియ మరో వారంలో అమల్లోకి రావొచ్చని మెట్రో వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం మెట్రో నడుస్తున్న మార్గంలో ఫ్రీక్వెన్సీని త్వరలో పెంచుతామని కొన్నాళ్లుగా ఎల్‌ అండ్‌ టీ మెట్రో ఊరిస్తోంది. ఆ ప్రకటన చేసి ఇప్పటికే 15 రోజులు దాటింది.. ఇంకెప్పుడు అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. కమిషనర్‌ ఆఫ్‌ మెట్రోరైలు సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్‌) అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని మెట్రో వర్గాలు అంటున్నాయి. నాగోల్‌ నుంచి అమీర్‌పేట ప్రస్తుతం నడుపుతున్న 15 నిమిషాలకో మెట్రో నడుస్తోంది. మరో వారం రోజుల్లో 8 నిమిషాలకో మెట్రో నడిపే అవకాశం ఉంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా ఫ్రీక్వెన్సీ ట్రయల్‌ నిర్వహిస్తోంది. సోమవారం ఉప్పల్‌ స్టేడియంలో ట్వంటీ20 మ్యాచ్‌ ముగిశాక ప్రేక్షకుల్ని గమ్యస్థానం చేర్చేందుకు అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులను నడిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఫ్రీక్వెన్సీని తగ్గించి మెట్రో నడిపారు. అధికారిక అనుమతితో రెగ్యులర్‌ సర్వీసులను పెంచనున్నారు.

గంటలోపే…
* మియాపూర్‌ నుంచి నాగోల్‌ చేరుకునేందుకు ప్రస్తుతం 64 నిమిషాలు పడుతోంది. రాబోయే రోజుల్లో ఇది 55 నిమిషాలకు తగ్గనుంది. దాదాపు 30 కి.మీ. దూరం ఉంటుంది. 9 నిమిషాల సమయం ఆదా కానుంది.
* నాగోల్‌ నుంచి అమీర్‌పేటకు వెళ్లేందుకు ప్రస్తుతం 40 నిమిషాలు అవుతోంది. ఇది 33 నిమిషాలకు తగ్గనుంది. ఏడు నిమిషాల సమయం కలిసి రానుంది.
* నాగోల్‌ నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు ప్రస్తుతం 20 నిమిషాల సమయం పడుతోంది. ఇది 16 నిమిషాలకు తగ్గనుంది.
* మియాపూర్‌ నుంచి అమీర్‌పేట వరకు ఇప్పుడు పట్టే సమయం 24 నిమిషాలు. రెండు 22 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటారు.

అంతేనా?
కిలోమీటరుకు ఒక స్టేషన్‌ ఉండటంతో వేగం పెంచినా ఆదా అయ్యే సమయం స్వల్పమే. నాగోల్‌ నుంచి మెట్టుగూడ వరకు, మియాపూర్‌ నుంచి అమీర్‌పేట వరకు 20 కి.మీ. పరిధిలో నిర్ధారిత వేగంతోనే కమ్యూనికేషన్‌ ఆధారిత నియంత్రణ వ్యవస్థ(సీబీటీసీ)తో ఆటోమెటిక్‌గా మెట్రోరైలు నడుస్తున్నాయి. మెట్టుగూడ నుంచి ఎస్‌ఆర్‌నగర్‌ వరకు 10 కి.మీ. మాత్రమే లోకోపైలైట్ల నియంత్రణలో నడుస్తున్నాయి. సీఎంఆర్‌ఎస్‌ అనుమతితో ఈ స్వల్పదూరమే వేగం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ మేరకు సమయం ఆదా కానుంది.
* అమీర్‌పేట నుంచి ఎస్‌ఆర్‌నగర్‌ స్టేషన్‌ 600 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కొద్దీదూరానికి ప్రస్తుతం నాలుగు నిమిషాల సమయం పడుతుంది. ఇక్కడ రెండు నిమిషాలు ఆదా కానుంది.
* అమీర్‌పేట నుంచి బేగంపేట వరకు 5 నిమిషాలు, మెట్టుగూడ వరకు మూడు నాలుగు నిమిషాల సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఈ వ్యవధి రెండు నుంచి మూడు నిమిషాలకు తగ్గనుంది.
* మెట్రో డోర్స్‌ ప్రస్తుతం ఎక్కువ సేపు తెరచుకుంటున్నాయి. ఈ వ్యవధిని గణనీయంగా తగ్గించనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com