హ్యూస్టన్ జనసేన ఆధ్వర్యంలో నిశ్శబ్ద ఆందోళన


హ్యూస్టన్ మహానగరంలో “రే మిల్లర్ పార్కులో-(రవింద్ర నాధ్ టాగూర్ పార్క్)” జనసేన కార్యకర్తలు రాజేష్ యాళ్ళబండి ఆధ్వర్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కి తమ సంఘీభావం తెలుపుతూ, మీడియా అరాచకాలను ఖండిస్తూ “సైలెంట్ ప్రొటెస్ట్” నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసెన నాయకులు విష్ణు నాగిరెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త మీడియా అఘాయిత్యాలని ఖండిస్తూ, యల్లో మీడియాని “బోయ్ కాట్” చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు మరింత బాధ్యతతో జనసేన సందేశాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. వెంకట్ శీలం మాట్లాడుతూ మీడియా తీరుమారవలసిన సమయమాసన్నమైందన్నారు.కృష్ణ చిరుమామిళ్ళ మాట్లాడుతూ, మీడియా తప్పుడు ప్రచారాలతో రాజకీయాలను ప్రభావితం చేస్తోందన్నారు.శశి లింగినేని ప్రస్తుత మీడియాలో మార్పు అవసరమన్నారు.వీరా కంబాల మాట్లాడుతూ మెరుగైన సమాజం కోసం ప్రవాసులు సహకరిస్తారని తెలిపారు. రాజేష్ యాళ్ళబండి మాట్లాడుతూ ప్రతీ కార్యకర్తా జనసేన సిద్ధాంతాలను, స్పెషల్ స్టేటస్ ఆవశ్యకత, పల్లెపల్లేకీ, ప్రతీ పౌరుడికీ చేర్చాలని కోరారు. రాష్ట్ర భవ్యషత్తు కోసం జనసేన అధికారంలోకి రావాలని, అందుకోసం ప్రవాసులు తగు రీతిలో కృషి చేస్తారని తెలిపారు.శేషాద్రి మంచం మాట్లాడుతూ ప్రస్తుత కలుషిత మీడియా ప్రధాన సమస్యలను ప్రక్కతోవ పట్టించడంలో సఫలీకృతమౌతుందన్నారు.దుర్గారావ్ నుప్పులేటి మాట్లాడుతూ మీడియా మరియు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ని పద్మవ్యూహంలోకి లాగుతోందని, ఆయన దాన్ని చేధిస్తారని పేర్కొన్నారు.చైతన్య కూచిపూడి మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా భ్రష్ఠు పట్టిన మీడియా చేష్టలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నామన్నారు.సురేష్ సత్తి పవన్ అభిమానులు, కార్యకర్తలూ సంయమానంగా ఉండాలని కోరారు.రాం సింహాద్రి మీడియా గురి చేస్తున్న ఇబ్బందులను ఖండించారు.సుబ్రమణ్యం వంగల మాట్లాడుతూ మీడియా ఇబ్బందికరమైన చర్యలను కట్టిపెట్టి, ప్రజాయోపమైన చర్యలు చేపాట్టాలన్నారు. నాగ్ మేకల అరాచక మీడియా శక్తులకు త్వరలో సరైన గుణపాఠం లభిస్తుందన్నారు.శ్రీకాంత్ మాట్లాడుతూ కుటుంబసభ్యులతో కలిసి టీవీ చూసే పరిస్థితి లేదని ఆవేదన వెలిబుచ్చారు.అనంతరం రాజకీయాల్లోను, తెలుగు జర్నలిజంలోనూ ఆశాజనకమైన మార్పులు ఆశిస్తూ “రవింద్ర నాధ్ టాగూర్” విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి జగన్ రాయవరపు, శేషగిరి రావు యల్లాప్రగడ, కిరణ్ వర్రే, శశి లింగినేని, సందీప్ రామినేని, రాం సింహాద్రి, కిషోర్ అధికారి, రమేష్ వరంగంటి, వెంకట్ బోనం, సుబ్రమణ్యం వంగల, వెంకట్ శీలం, వీరా కంబాల, దుర్గారావ్ నుప్పులేటి, శేషద్రి మంచెం, నాగ్ మేకల, సురెష్ సత్తి, చైతన్య కూచిపూడి, మహేష్ ముద్దాల, కృష్ణ చిరుమామిళ్ళ, రాజేష్ యాళ్ళబండి, విష్ణు నాగిరెడ్డి, శ్రీకాంత్, హ్యూస్టన్ పరిసర ప్రాంత జనసేన కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు హాజరయ్యారు.

janasena houston, tnilive.com, pawan kalyan houston usa america, telugu news international

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com