౧౫ నుండి

ఎన్టీఆర్‌ కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారైంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సీకే మురళీధరన్‌ను ఇటీవల ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఫిబ్రవరి 10న పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. రెగ్యులర్‌ షూటింగ్‌ 15 నుంచి ప్రారంభించనున్నట్లు నందమూరి కల్యాణ్‌రామ్‌ తన ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. ఈ చిత్రానికి ‘జై.. లవ కుశ..’ పేరు పరిశీలనలో ఉంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ బ్యానర్‌పై కల్యాణ్‌రామ్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ తన కెరీర్‌లో తొలిసారిగా ఇందులో త్రిపాత్రాభినయం చేయనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com