౨౬న వస్తున్నాను

మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. ప్రజ్ఞా జైస్వాల్‌ కథానాయిక. బ్రహ్మానందం కీలక పాత్రధారి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. కీర్తి చౌదరి, కిట్టు నిర్మాతలు. జనవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘విష్ణు – నాగేశ్వరరెడ్డిలది విజయవంతమైన జోడీ. వీరిద్దరి నుంచి వచ్చిన ‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’ మంచి విజయాల్ని అందుకున్నాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం. సంపూర్ణ వినోదాత్మక చిత్రం ఇది. బ్రహ్మానందం పాత్ర గుర్తుండిపోయేలా తీర్చిదిద్దామ’’న్నారు. తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, ప్రవీణ్‌, విద్యుల్లేఖ రామన్‌ తదితరులు నటిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com