1000కోట్ల మానవాళి మనది

మరో మూడు దశాబ్దాల్లో ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరనుందా? ప్రస్తుత పెరుగుదలను చూస్తే ఇది నిజమేనని పాపులేషన్‌ రిఫరెన్స్‌ బ్యూరో (పీఆర్‌బీ) పేర్కొంది. 2050 నాటికి 980 కోట్లకు చేరి ఆ తర్వాత 2053 నాటికి ప్రపంచ జనాభా సహస్ర కోటికి చేరుతుందని ఈ సంస్థ తాజా అంచనా. 1962 నుంచి ఏటా ఈ సంస్థ జనాభా వృద్ధిపై అంచనాలను వెలువరిస్తుంటుంది. జనాభా వృద్ధిపాటు వివిధ దేశాల్లో వృద్ధిలో క్షీణతను, సంతాన అభివృద్ధి అంచనాలతో వివరాలను వెల్లడిస్తుంటుంది. అప్పటికి యూరప్‌లో జననాల రేటు బాగా తగ్గి జనాభా భారీగా తగ్గిపోనుండగా ఆఫ్రికా దేశాల్లో దాదాపు రెట్టింపు అవుతుందని ఈ నివేదిక పేర్కొంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com