125 ఏళ్ల జైలుశిక్ష

బాలికలు మొదలుకొని యువతుల వరకూ 260 మందికిపైగా అమెరికాలోని క్రీడాకారిణులను దశాబ్దాలకు తరబడి లైంగికంగా వేధించిన మాజీ వైద్యుడు లారీ నస్సేర్‌కు గరిష్ఠంగా 125 ఏళ్ల జైలు శిక్ష పడింది. మిషిగన్‌లోని చార్లెట్‌ న్యాయస్థానం సోమవారం ఈ శిక్ష విధించింది. మిషిగన్‌ స్టేట్‌ వర్సిటీ క్లీనిక్‌లో లారీ వైద్యుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే చికిత్స పేరుతో క్రీడాకారిణులను లైంగికంగా వేధించారు. బాలికల అశ్లీల వీడియోలను కలిగివున్నందుకు ఈయనకు ఇప్పటికే గత డిసెంబరులో 60 ఏళ్ల జైలు శిక్ష పడింది. భిన్న లైంగిక వేధింపుల ఆరోపణలపై గరిష్ఠంగా 175 ఏళ్ల శిక్షనూ జనవరిలో విధించారు. తాజా 125 ఏళ్ల శిక్షను జిమ్నాస్టిక్స్‌ కేంద్రంలో శిక్షణ సమయంలో పాల్పడ్డ వేధింపులకుగాను విధించారు. తీర్పు వెలువడిన అనంతరం లారీ క్షమాపణలు చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com