16శాతం ఐఆర్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం

ఆర్టీసీ ఉద్యోగులకు 16శాతం ఐఆర్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ సాధన ఉద్యమంలో కేసీఆర్‌కు అండగా బస్సు చక్రాలను కదలనీయకుండా చేసిన ఆర్టీసీ కార్మికుల గొప్పతనం కేంద్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రిపై విశ్వాసంతో వారు 25 శాతం ఐఆర్‌ అడిగారన్నారు. కేసీఆర్‌ కార్మిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో కమిటీ వేసి చర్చించి 16 శాతం ఐఆర్‌ ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఐఆర్‌ కారణంగా సంస్థపై నెలకు రూ.16కోట్లు అదనపు భారం పడుతుందని రవాణ శాఖ మంత్రి మహీందర్‌ రెడ్డి తెలిపారు. ఏటా దాదాపు రూ.200 కోట్లు అదనపు భారం పడుతుందన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీకి నష్టాలు రాకుండా కార్మికులు సహకరించాలని ఆయన కోరారు. పల్లెవెలుగు బస్సులు నష్టాల్లో ఉన్నాయన్నారు. తెలంగాణ ఏర్పడని నాటి నుంచి ఆర్టీసీని లాభాల బాటలో పయనింపజేసేందుకు సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించుకున్నారని రాష్ట్రమంత్రి కేటీఆర్‌ తెలిపారు. కేసీఆర్‌ కార్మిక పక్షపాతి అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది కార్మికులను ఆర్టీసీ నాయకులు నడిపించడంతో వారి సమస్యలను ముఖ్యమంత్రి పరిశీలించారన్నారు. భవిష్యత్తులో చేపట్టే సంస్కరణలకు కార్మికులు కూడా సహకరించాలన్నారు. టీఎంయూ గౌరవాధ్యక్షుడి పాత్రలో హరీశ్‌రావు సమస్య పరిష్కారానికి విశేష కృషి చేశారన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com