1982లో పుట్టాడు

టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ షమిపై ఆయన భార్య హసీన్‌ జహాన్‌ మరోసారి ఫేస్‌బుక్‌ వేదికగా షాకిచ్చింది. వయసు ధ్రువీకరణ పత్రం తప్పుగా చూపించి బీసీసీఐ, బెంగాల్‌ క్రికెట్‌ బోర్డును మోసం చేశాడని పేర్కొంది. అంతేకాదు షమికి చెందిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ను ఫొటో తీసి పెట్టింది. ఇందులో షమి పుట్టింది 1982 అని ఉంది. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌, క్రికెటర్ల వివరాలు తెలిపే ప్రముఖ వెబ్‌సైట్లలో షమి పుట్టిన సంవత్సరం 1990 మార్చి 9న జన్మించినట్లు చూపిస్తోంది. దీని ప్రకారం అతని వయసు 28 ఏళ్లు. కానీ హసీన్‌ జహాన్‌… షమి పుట్టింది 1990లో కాదు 1982లో అని చెబుతోంది. శనివారం హసీన్‌ జహాన్‌ తన షేస్‌బుక్‌ పేజీలో షమి డ్రైవింగ్‌ లైసెన్స్‌కు సంబంధించిన ఫొటో పెట్టింది. ఇందులో షమి పుట్టిన సంవత్సరం 1982 అని ఉంది. తప్పుడు ధ్రువపత్రాలు చూపించి షమి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు బీసీసీఐని, రాష్ట్రం తరఫున ఆడేందుకు బెంగాల్‌ క్రికెట్‌ బోర్డును, ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని మోసం చేసినట్లుగా ఆమె పేర్కొంది. కొన్ని గంటల వ్యవధిలోనే హసీన్‌ తన పోస్టును తొలగించింది. కానీ, అప్పటికే ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో కూడా హసీన్‌… షమి పలువురు మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని పేర్కొండి వాట్సప్‌ సంభాషణలను ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షమి ఐపీఎల్‌లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఆడుతున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా షమి తన ఫామ్‌ను కొనసాగించలేకపోతున్నాడని, అతడు ఫామ్‌ను అందుకోవడానికి కొంత సమయం పడుతుందని దిల్లీ డేర్‌డెవిల్స్‌ బౌలింగ్‌ కోచ్‌ జేమ్స్‌ హోప్స్‌ అభిప్రాయపడ్డాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com