1988లో వ్యక్తిని కొడితే…2018లో ₹1000 జరిమానా

1988 నాటి కేసు నుంచి పంజాబ్‌ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూకు విముక్తి లభించింది. ఈ కేసులో సిద్ధూపై ఉన్న దోషపూరిత హత్య ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే ఓ వ్యక్తిని గాయపర్చినందుకు గాను ఆయనకు రూ. 1000 జరిమానా విధించింది. 1988 డిసెంబంరు 17న పాటియాలాలోని రహదారి మధ్యలో వాహనాన్ని నిలిపిన ఘటనలో గుర్నాంసింగ్‌ అనే వ్యక్తికి సిద్ధూకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో సిద్ధూ వెంట ఆయన మిత్రుడు రూపీందర్‌ సింగ్‌ సంధు కూడా ఉన్నారు. ఈ క్రమంలో గుర్నాంసింగ్‌పై సిద్ధూ చేయిచేసుకున్నారు. కాగా.. ఈ ఘటనలో గుర్నాంసింగ్‌ చనిపోయారు. దీంతో సిద్ధూనే ఆయనను కొట్టి చంపారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ట్రయల్‌ కోర్టు తోసిపుచ్చగా.. పంజాబ్‌, హరియాణా హైకోర్టు మాత్రం సమర్థించింది. ఈ ఘటనను దోషపూరిత హత్యగా పేర్కొంటూ 2006లో సిద్ధూకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ 2007లో సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సిద్ధూ జైలు శిక్షను నిలిపివేసి బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే గుర్నాంసింగ్‌ను గాయపర్చినందుకు గాను రూ. 1000 జరిమానా విధించింది. ఆయన స్నేహితుడిని సైతం నిర్దోషిగా ప్రకటించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com