2019 ఎన్నికల్లో…ప్రతిపక్షాలు-పరాజయం ఓవైపు. తెదేపా-గెలుపు ఓవైపు.


ప్రజల్లో ప్రతిరోజు తిరగాలి కాబట్టి, దానికి తగిన హోదా కావాలి కాబట్టి తమలాంటి వారికి పార్టీలు, పదవులు అవసరమని…ఎటువంటి అవసరం లేకున్నా భద్రమైన జీవితం ఉన్నప్పటికీ తెదేపాకు నిస్వార్థంగా సేవ చేస్తున్న ఏకైక విభాగం ప్రవాస తెలుగుదేశమేనని పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఇర్వింగ్‌లోని అమరావతి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రవాసులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల ద్వార లేదా ఇతరత్రా మార్గాల ద్వార పార్టీని నిలబెట్టుకోవాలని, కాపాడాలని తహతహలాడే ఏకైక విభాగం ప్రవాస తెలుగుదేశం ఒక్కటేనని, దీనికి వారు సదా అభినందనీయులని అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రతిపక్షాలు అన్నీ ఓవైపు పోరాడినా పరాజయం వారిని తప్పక వరిస్తుందని, 70ఏళ్ల వయస్సులో కూడా సమాజం కోసం తపిస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని తెదేపా విజయం అందుకుంటుందని ఆయన ధీమా వ్యక్తపరిచారు. ప.గో.జిల్లాలో 70ఏళ్లలో 1700కిమీల రాదారి పనులు చేపడితే 2014 నుండి ఇప్పటివరకు తెదేపా హయాంలో 2800కిమీల మేర అభివృద్ధి పనులు చేపట్టామని, నూరు శాతం బహిరంగ విసర్జన రహిత జిల్లాగా ప.గో నిలిచిందని ఆయన తెలిపారు. టి.నర్సాపురం జడ్పీ సభ్యుడు నల్లూరి చలపతిరావు మాట్లాడుతూ ప్రవాసుల కన్నా సామన్యులైన ఓటర్లు చాలా తెలివైన వారు ఉన్నారని, తెదేపా గెలుపు ఆవశ్యకతను వారు బాగా అర్థం చేసుకున్నారని, తమ లాంటి నాయకులు కూడా క్షేత్రస్థాయిలో వారిని గుర్తెరిగి వ్యవహరిస్తూ పార్టీ కోసం పనిచేస్తున్నామని అన్నారు. గుంటూరు జడ్పీ వైస్-చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ తుళ్లూరు మండలంలో మరో 250 ఎకరాలు మాత్రమే రైతుల వద్ద నుండి సమీకరించవల్సి ఉందని, రాజధాని యువత తమకు ఉద్యోగాలు వస్తాయనే భరోసాతో భూములు స్వచ్ఛందంగా ఇస్తున్నారని, కానీ వారిని ఉద్యోగాలు సృష్టించేవారిగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని వెల్లడించారు. సింగపూర్ ప్రవాసుడు, తణుకు శాసనసభ్యుడు ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇప్పటివరకు 100కిమీ మేర సిమెంటు రహదారులు ఏర్పాటు చేశామని, ఎన్.టీ.ఆర్ తెలుగువారందరికీ స్ఫూర్తిదాయకమైతే చంద్రబాబు దూరదృష్టికి చిరునామాగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఆయన కొనియాడారు. సభలో ప్రసంగించిన వక్తలందరూ ప్రవాసులు వచ్చే ఎన్నికల్లో 2014 ఎన్నికల కన్నా అధికంగా తెదేపా గెలుపు కోసం మరింతగా కృషి చేయాలని కోరారు. 2019 ఎన్నికల్లో పోలవరం, రాజధాని మాత్రమే విజయానికి మార్గాలని వక్తలు అభిప్రాయపడ్డారు. సభ ప్రారంభంలో సుగన్ చాగర్లమూడి, లోకేష్ నాయుడు, సుబ్బారావు, కిషోర్ చలసాని, నవీన్, సూరపనేని రాజా, చండ్ర దిలీప్ కుమార్, ఆచంట చౌదరి, సుమంత్ పుసులూరి తదితరులు ప్రసంగించారు. సభ అనంతరం డల్లాస్ తెదేపా ఆధ్వర్యంలో సినీనటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించారు.

tags: nri nr tdp dallas telugu desam party 2018 mahanadu mullapudi bapiraju nalluri chalapati rao vadlamudi purnachandra rao aarumilli radhakrishna nri telugudesam tnilive tnilive.com telugu news international photo gallery

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com