2019 జూలై 4,5,6 తేదీల్లో డీసీలో తానా సభలు


ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ ద్వైవార్షిక మహాసభలకు 2019 జూలై 4,5,6 తేదీలలో వాషింగ్టన్ డీసీ లోని వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కాబోతోంది. ప్రవాస తెలుగు సంఘాల్లో మొదటిది, పెద్దది అయిన తానా అంగరంగ వైభవంగా ప్రతి రెండేళ్ళకొకసారి జరుపుకునే మహాసభలకు 12 సంవత్సరాల అనంతరం తిరిగి వాషింగ్టన్ డీసీ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈమేరకు జూన్ 15వ తేదీన తానా అధ్యక్షుడు సతీష్ వేమన, కార్యవర్గ సభ్యులతో కలిసి వాషింగ్టన్ డీసీలోని వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ అధికారులతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ వాషింగ్టన్ డీసీలో తానా మహాసభల ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేశామని, ఈ మహాసభల నిర్వహణలో పాలుపంచుకోవటానికి వాషింగ్టన్ డీసీ ప్రవాసులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని, అందరి సహకారంతో తానా ప్రతిష్ఠ మరింత పెంచేలా తెలుగు బాషా సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా మహాసభలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, తానా బోర్డు చైర్మన్ చలపతి కొండ్రకుంట, తానా ఫౌండేషన్ చైర్మన్ డా.ప్రసాద్ నల్లూరి, మాజీ బోర్డు చైర్మన్ డా. నరేన్ కొడాలి, 2007 తానా మహాసభల కన్వీనర్ డా.హేమప్రసాద్ యడ్ల, తానా కోశాధికారి రవి పొట్లూరి, డా. వెంకట్రావు మూల్పూరి, తానా ఫౌండేషన్ కోశాధికారి రమాకాంత్ కోయ, ట్రస్టీ రవి మందలపు క్యాపిటల్ రీజియన్ ప్రాంతీయ కోఆర్డినేటర్ రఘు మేకా, గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం అధ్యక్షులు సత్యనారాయణ మన్నే, రామ్ చౌదరి ఉప్పుటూరి తదితరులు పాల్గొన్నారు.


tags tnilive.com tni telugu news international tana tni tana 2019 vemana satish jayaram komati telugu association of north america tana conferene washington dc yadla hemaprasad mulpuri venkatarao

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com