2019 తర్వాత

టీమిండియా ప్రపంచకప్‌ల హీరో, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్‌ తన రిటైర్‌మెంట్‌ ప్రకటనపై పెదవి విప్పాడు. 2019 తర్వాతే వీడ్కోలు గురించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించాడు. అదే ఏడాది ఇంగ్లాండ్‌లో ఐసీసీ ప్రపంచకప్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. యువీ టీమిండియా తరఫున చివరి వన్డే 2017 జూన్‌లో ఆడాడు. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కొత్త సీజన్‌లో మెరుపులు మెరిపించాలని పట్టుదలతో ఉన్నాడు. భారత టీ20 జట్టులో స్థానం పదిలం చేసుకోవాలని కోరుకుంటున్నాడు. మంచి ప్రదర్శనలతో 2019 ప్రపంచకప్‌లో ఆడాలని అనుకుంటున్నాడు. ‘ఐపీఎల్‌లో బాగా ఆడాలని కోరుకుంటున్నాను. 2019 వరకు క్రికెట్‌ ఆడేందుకు ఐపీఎల్‌ నాకు కీలకం కానుంది. 2019 వరకు క్రికెట్‌ ఆడాలన్నది నా ఉద్దేశం. ఇప్పుడు వచ్చే అవకాశాలు, ఆడుతున్న తీరును బట్టే వీడ్కోలు నిర్ణయం తీసుకుంటా’ అని పద్దెనిమిదో లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డు వేడుకలకు హాజరైన యువీ అన్నాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com