2020 కల్లా స్లీపింగ్ బెర్తులు

త్వరలో ఎయిర్‌బస్‌ విమానాల్లో పడుకొని ప్రయాణించొచ్చు. అంటే సీట్లలో కూర్చుని కళ్లు మూసుకోవడం కాదండి.. ఎంచక్కా కాళ్లు చాపుకుని కునుకు తీసేయ్యొచ్చు. ఎందుకంటే తమ విమానాల్లో స్లీపింగ్‌ బెర్త్‌లను తీసుకొస్తోంది యూరప్‌కు చెందిన ఈ విమానాయాన సంస్థ. ఫ్రాన్స్‌కు చెందిన జొడాయిక్‌ ఏరోస్పేస్‌తో కలిసి విమానాల్లో లగ్జరీ స్లీపింగ్‌ బెర్త్‌లను తీసుకొస్తున్నట్లు ఎయిర్‌బస్‌ ప్రకటించింది. వీటిని విమానంలో కార్గో కంపార్ట్‌మెంట్‌లలో ఏర్పాటుచేయనున్నట్లు తెలిపింది. తొలుత ఏ330 విమానాల్లో వీటిని పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. 2020 నాటికి ఈ సదుపాయాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు ఎయిర్‌బస్‌ వెల్లడించింది. ప్రయాణికుల సౌకర్యార్థమే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఎయిర్‌బస్‌, జొడాయిక్‌ ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. వీటితో తమ సంస్థకు అదనపు లబ్ధికూడా చేకూరుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది. గతంలో ఎయిర్‌ఫ్రాన్స్‌-కేఎల్‌ఎం కూడా ఇలాంటి ఆలోచనే చేసింది. ఎకానమీ క్లాస్‌లో క్యాబిన్‌ పైన స్లీపింగ్‌ బెర్త్‌లను తీసుకురావాలని యోచించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com