2500 కి.మీ. పూర్తి చేసిన జగన్

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన‌ ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం తూర్పు గోదావరి జిల్లాలో 2500 కిలోమీటర్ల మైలురాయికి చేరింది. ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గంలోని చెల్లూరు వద్ద జగన్‌ వేప చెట్టు నాటారు. 208వ రోజు పాదయాత్ర కొనసాగించిన ఆయన మాచవరం వరకు నడిచారు. మాజీ ముఖ్య మంత్రి రాజశేఖర్‌ రెడ్డి 69వ జయంతి వేడుకల్లో జగన్‌ పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. తరువాత రక్తదాన శిబిరం ప్రారంభించారు. పలు జిల్లాల్లో వైఎస్‌స్సార్‌ జయంతి వేడుకలను అభిమానులు నిర్వహించారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైఎస్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కడపలో అన్నదానం నిర్వహించిన వైకాపా నేతలు ఏపీలో తిరిగి వైఎస్‌స్సార్‌ పాలన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com