8న వస్తున్నాడు

శిబు తమీన్స్‌ నిర్మాణంలో ‘అరిమానంబి’ ఫేమ్‌ ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో విక్రం కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ఇరుముగన్‌’. తెలుగులో ‘ఇంకొక్కడు’ పేరుతో రూపుదిద్దుకుంటోంది. ఇందులో నయనతార, నిత్యామేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు హ్యారీస్‌ జయరాజ్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని సెన్సార్‌బోర్డు అధికారులు సోమవారం వీక్షించారు. దీనికి ‘యు’ సర్టిఫికెట్‌ వస్తుందని చిత్రయూనిట్‌ భావించగా… సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి ‘యు/ఏ’ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ కెమికల్‌కు సంబంధించి యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించాం. విక్రంను కొత్తకోణంలో చూడొచ్చు. ఇందులో నయనతార నటన హైలెట్‌గా ఉంటుంది. విక్రం అభిమానులను ఈ సినిమా అమితంగా ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇదిలా ఉండగా విక్రం నటించిన ‘ఐ’ చిత్రానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. ఈ సినిమాకు మాత్రం అంత హంగు ఆర్భాటం చేయకుండా.. సాధారణంగా తెరపైకి తీసుకెళ్లానని విక్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com