Movies

సంగీత సాధన

Keerthy Suresh Practices Singing And Music

ఎన్ని పనులున్నా రోజూ ఏదో ఒక సందర్భంలో నాదైన ప్రపంచంలోకి వెళ్లి రావల్సిందే అంటోంది కీర్తి సురేష్. ‘మహానటి’ చిత్రంతో తన కీర్తిని మరింత పెంచుకొన్న కథానాయిక ఈమె. ప్రస్తుతం తెలుగుపైనే ఎక్కువ దృష్టిపెట్టినా, తమిళం, హిందీ పరిశ్రమల నుంచీ అవకాశాలు అందుకొంటోంది. సినిమాలతో సంబంధం లేకుండా మీ గురించి కొన్ని విషయాలు చెప్పండని అడిగితే..అదొక పెద్ద చరిత్ర అంటూ నవ్వేస్తోంది. ‘‘వ్యక్తిగతంగా నాకొక ప్రత్యేకమైన ప్రపంచం ఉంది. అందులోకి వెళ్లానంటే మరేదీ గుర్తుకు రాదు. నాకు ఇష్టమైన పనులన్నీ చేస్తుంటా. చిన్నప్పట్నుంచి మనకు కొన్ని హాబీలు ఉంటాయి కదా. అవి ఇప్పటికీ మరిచిపోలేదు. టీవీలో వంటలకి సంబంధించిన కార్యక్రమాలు, ఆటలు చూడటం మొదలుకొని… సంగీత సాధన చేయడం వరకు ఏదనిపిస్తే అది చేస్తా. ఇంట్లోకి అడుగు పెట్టానంటే అసలు నేనొక నటిని అనే విషయమే గుర్తుకు రాదు. సినిమా చూస్తున్నా దాన్ని ఒక ప్రేక్షకురాలిగా ఆస్వాదించడమే అలవాటు తప్ప మళ్లీ అందులో నన్ను నేను చూసుకోవడం ఇష్టం ఉండదు’’ అని చెప్పింది కీర్తి.