TNI చెప్పినదాన్నే కేంద్ర మంత్రి ధృవీకరించారు

ఫిబ్రవరి 15న TNI ప్రచురించిన కథనం

దేశంలో ఎక్కడ లేని నోట్ల కొరత ఆంధ్రా రాష్ట్రంలో ఏర్పడింది. నోట్లను రద్దు చేసిన సమయంలో దేశం అంతా నోట్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం మాత్రం ఒక్క ఏపీ లోనే నోట్ల కొరత ఎందుకు ఏర్పడిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వాస్తవానికి నోట్ల రద్దు చసె సమయానికి ఇప్పటికి ఏటీఎంల సంఖ్య ఆంధ్రా రాష్ట్రంలో పది శాతం పెరిగింది. అయినప్పటికీ నోట్ల కొరత భారీగా ఏర్పడింది. స్థానిక ప్రజలు పనులు మానుకుని ఏటీఎం ల ముందు పడిగాపులు పడుతున్నారు. గత వారం రోజుల నుండి ఏటీఎంల ముందు పెద్ద పెద్ద క్యూ లు ఉంటున్నాయి. విజయవాడ , గుంటూరు, తిరుపతి, అనంతపురం, ఒంగోలు వంటి పట్టణాలతో పాటు చిన్న ప్రాంతాలలోను నోట్ల కొరత ఏర్పడింది.

** త్వరలో జరగనున్న ఎన్నికలే కారణమా ..
ఆంధ్రా రాష్ట్రంలో త్వరలో సాధారణ ఎన్నికలతో పాటు వివిధ స్థాయిల్లో ఎన్నికలు కూడా జరగనున్నాయి. సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పదవీ కాలం కొద్ది నెలలోనే ముగుస్తుంది. సహకార సంఘలకు ఎన్నికైన పాలకవర్గాల పదవీ కాలం ముగిసిపోయింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పద్నాలుగు నెలలు మాత్రమె సమయం ఉంది. వీటికి ముందస్తు ఎన్నికలు కూడా రావచ్చు అంటున్నారు. ఈ నేపద్యంలో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఎన్నికల్లో ఖర్చు చేయటానికి ముందు జాగ్రత్త చర్యగా ఏటీఎంల నుండి సొమ్ములు లాగేసి నిల్వపెడుతున్నారా? అనే అనుమానాలు భారీగా వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ విషయం పైనే తీవ్రంగా చర్చలు సాగుతున్నాయి. ఒక్కొక్క ఏటీఎంలో దాని సామర్ధ్యాన్ని బట్టి, నోట్ల సామర్ధ్యాన్ని బట్టి ఇరవై నుండి 23లక్షల వరకు ఒకేసరి నింపవచ్చు. ఏటీఎంలలో బ్యాంకర్లు పెడుతున్న రెండువేల రూపాయల నోట్లు తిరిగి మార్కెట్లోకి రాకపోవడంతో బ్యాంకర్లు ఏటీఎంలలో రెండు వేల రూపాయలు పెట్టడం నిలిపివేస్తున్నారు. రెండు వేల రూపాయల నోట్లను ఏటీఎంలలో పెట్టవద్దని బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో సొమ్ములు తీసుకునేవారికి రెండువేల రూపాయ నోట్లు ఎక్కువగా ఇవ్వవద్దని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్, స్థానిక బాంక్ లకు ఆదేశాలు ఇచ్చింది.

*** కాస్త కరెన్సీ తెచ్చి పెడతారా?!..
ఆంధ్రా రాష్ట్రంలో కరెన్సీ నోట్లకు డిమాండ్ ఏర్పడటంతో పొరుగు రాష్ట్రాల నుండి రాష్ట్రానికి వస్తున్న తమ బంధువులు, స్నేహితులు, సన్నిహితులను తమకు కావాల్సిన కరెన్సీ నోట్లను తెచ్చి పెడతారా? అని ఏపీ ప్రజలు కోరుతున్నారు.

*** రూ.ఐదు వేల కోట్లు ఇచ్చి ఆదుకోండి..
ఏటీఎంలలో నోట్ల కొరత ఏర్పడటంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. నోట్ల రద్దు సమయంలో ఆంధ్రాకు ఎక్కువ సొమ్ములు వచ్చే విధంగా కేంద్రం వద్ద తమ పలుకుబడి ఉపయోగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పర్యాయం కూడా అదే తరహా ప్రయత్నాలు ప్రారంభించారు. తక్షణమే రూ. ఐదు వేల కోట్లు కరెన్సీని ఆంధ్రా రాష్ట్రానికి కేటాయించాలని చంద్రబాబు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపద్యంలో చంద్రబాబు లేఖకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూద్దాం. – కిలారు ముద్దుకృష్ణ

###############################

నేడు జైట్లీ ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు భారీ ఎత్తున కరెన్సీని దాచుకున్నారా?అందుకే ఏటీఎంలలో నోట్ల కొరత ఏర్పడిందా? ఈ ప్రశ్నలకు స్వయానా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అవునన్నట్లుగా సమాధానం చెబుతున్నారు. బుధవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ఉండగా.. తెలంగాణ బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి పుష్పలీల అక్కడికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని ఏటీఎంలలో డబ్బులు లేవని, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయనకు వివరించారు.దీనికి మంత్రి స్పందిస్తూ.. తాము ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన దానికంటే ఎక్కువ కరెన్సీని సరఫరా చేశామని వివరించారు. అయినా.. కరెన్సీ కొరత నెలకొనడం ఆశ్చర్యకరమన్నారు. నోట్ల కట్టలను ఇళ్లలో.. లాకర్లలో దాచుకోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

###############################

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com