ప్రముఖ నటి అమీ జాక్సన్ తల్లి కాబోతున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో అమీ కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారు. న్యూఇయర్ సందర్భంగా జాంబియాలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ నేపథ్యంలో తాను తల్లి కాబోతున్నట్లు అమీ సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. ‘మీ అందరికీ ఈ విషయాన్ని అరిచి మరీ చెప్పాలని ఎదురుచూస్తున్నాను. మాతృదినోత్సవానికి (బ్రిటన్‌లో ఈరోజు మదర్స్ డే) మించిన సరైన రోజు మరొకటి ఉండదు. ఈ ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నిన్ను (బేబీని ఉద్దేశిస్తూ) ప్రేమిస్తున్నాను. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. దాంతో అభిమానుల నుంచి అమీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో ‘ఎవడు’, ‘అభినేత్రి’ చిత్రాల్లో నటించారు అమీ. గతేడాది విడుదలైన ‘2.ఓ’ చిత్రం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇందులో ఆమె సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జోడీగా రోబో పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
అమీ జాక్సన్ సంతోషం
Related tags :