ScienceAndTech

అంతర్జాలానికి కళ్లెం వేయాలనే వాదనను బలపర్చింది

అంతర్జాలానికి కళ్లెం వేయాలనే వాదనను బలపర్చింది

ప్రభుత్వాలు అంతర్జాలాన్ని నియంత్రించే విషయంలో మరింత చురుగ్గా ఉండాలని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. యూరోపియన్‌ దేశాల్లో ఉన్న నిబంధనలను మరిన్ని దేశాల్లో అమలు చేసి వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచేలా చూడాలన్నారు. మొత్తం నాలుగు విభాగాల్లో నిబంధనలు అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రమాదకరమైన కంటెంట్‌, ఎన్నికల సంరక్షణ, వ్యక్తిగత గోప్యత, డేటా మార్పిడి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని.. వ్యక్తిగత గోప్యత విషయంలో ప్రభుత్వాలు నిబంధనలను యూరోపియన్‌ యూనియన్‌ వలే పటిష్ఠం చేసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఫేస్‌బుక్‌ ఈ నాలుగు అంశాల్లో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఇటీవల న్యూజిలాండ్‌లో మసీదుపై దాడిని లైవ్‌స్ట్రీమ్‌ చేయడంతో ఆ విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌, ఇతర ఇంటర్నెట్‌ దిగ్గజాలు ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాకు కళ్లెం వేయాలనే ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ఫేస్‌బుక్‌ కూడా తన మాటను మార్చుకొంది. దీంతో అంతర్జాలానికి కళ్లెం వేయాలనే వాదనను బలపర్చింది.