తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పీఎస్‌ఎల్‌వీ సీ45 వాహకనౌక నమూనాతో ఆలయానికి చేరుకున్న శాస్త్రవేత్తలు.. నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రార్థించారు. రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రతి ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తోంది.
తిరుమలలో ఇస్రో బృందం

Related tags :