Movies

అప్పుడే విడాకులా?

అప్పుడే విడాకులా?

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా.. తన భర్త నిక్‌ జొనాస్‌ నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? అమెరికాకు చెందిన ‘ఓకే’ అనే మ్యాగజైన్‌ ప్రచురించిన కథనంలో ఈ విషయం వెల్లడైంది. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకునే క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ‘ప్రతి విషయంలో ప్రియాంక, నిక్‌ గొడవపడుతున్నారు. అది పని విషయంలో కావొచ్చు, లేదా పార్టీల విషయమైనా అవ్వచ్చు. మొత్తానికి వారు పెళ్లి విషయంలో తొందరపడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు అందుకు అనుభవిస్తున్నారు. మొదట్లో ప్రియాంక అన్నీ తేలిగ్గా తీసుకునే వ్యక్తని నిక్‌ అనుకున్నాడు. కానీ నిక్‌ను అదుపులో పెట్టాలని ప్రియాంక అనుకుంటోంది. అది నిక్‌కు నచ్చలేదు. ప్రియాంకకు కోపం ఎక్కువన్న సంగతి కూడా నిక్‌కు పెళ్లికి ముందు తెలీదు. దాంతో నిక్‌ కుటుంబీకులు కూడా త్వరగా విడాకులు తీసుకోవాలని అతనిపై ఒత్తిడి తెస్తున్నారు’ అని ఆర్టికల్‌లో ప్రచురించింది. దాంతో ఈ విషయం కాస్త అటు హాలీవుడ్‌లో, ఇటు బాలీవుడ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రియాంక, తన భర్తతో, కుటుంబీకులతో కలిసి పార్టీల్లో, ఇతర కార్యక్రమాల్లో ఎంజాయ్‌ చేస్తున్న వీడియోలు ఎప్పటికప్పుడు బయటికి వస్తూనే ఉన్నాయి. ప్రియాంక తనకు సరైన భాగస్వామి అని, ఇప్పటికైతే తమ వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతోందని గతంలో నిక్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరి అలాంటప్పుడు ఓకే మ్యాగజైన్‌ ఏ ఆధారాలతో ఈ ఆర్టికల్‌ను ప్రచురించిందో తెలియరాలేదు. దీనిపై నిక్‌, ప్రియాంక ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.