చెదిరిన జుట్టు.. చిరిగిన ప్యాంటు… ఫ్యాషన్ ట్రెండ్‌గా నడిచే ఈ రోజుల్లో మాసిన షూ యువతకు నచ్చదా? అనుకుంది ప్రముఖ పాదరక్షల కంపెనీ గూచీ. అందుకే ‘డర్టీ స్నీకర్స్’ పేరుతో షూ తయారు చేసింది. 1970లలో ఆటగాళ్ల షూ మాసి పోయి ఉండేవి. తెల్లని షూపై మాపు, బురద, మరకలతో ఇవి దర్శనమిచ్చేవి. అచ్చం అలాంటి లుక్‌తోనే ఈ షూ విడుదల చేసింది కంపెనీ. ఇదేం పెద్ద విషయం కాకపోయినా వీటి ధర వింటే మాత్రం కళ్లు తిరుగుతాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్‌కి ఒక నెల బాడుగ కట్టొచ్చు ఈ డబ్బుతో. ఇంతకీ ధర చెప్పలేదు కదూ రూ.61,938 (870 యూఎస్ డాలర్లు).
ఈ మురికి బూట్లు 800డాలర్లకు పైనే
Related tags :