తియ్యగా, చల్లగా ఉండే ఆహారం తీసుకోవాలి. చారు, కారంలేని పులుసు, మజ్జిగ చారు, పెరుగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. దాహం లేకపోయినా, కుండలోని నీళ్లు తాగుతూ ఉండాలి.ఫ్రిడ్జ్‌లో నీటి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగే ప్రమాదం ఉంది.మట్టిలో ఆల్కలైన్ ఉంటుంది. అది కుండలో నింపిన నీటిలోకి ఆమ్లాలు దరిచేరకుండా చూసుకుంటుంది. దీంతో అసిడిటీ సమస్య ఉండదు. అందుకే మట్టి కుండల్లో వండే ఆహారం తీసుకుంటే గ్యాస్ట్రిక్, అసిడిటీ సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.మట్టికుండలోని నీటిని తాగడం వల్ల శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇంకా గొంతుకి సంబంధించిన రోగాలను దూరం చేసుకోవచ్చు. మట్టి పాత్రలను ఉపయోగించేటప్పుడు రోజూ వాటిని శుభ్రం చేస్తూ ఉండాలి.
కుండలో నీటి రుచికి లేదు సాటి
Related tags :