Health

కర్బూజలో మేలైన గుణాలు!

health benefits of kharbuja

కర్బూజ వేసవిలో విరివిగా దొరుకుతుంది. ఒకింత చవకగానూ లభిస్తుంది. కాబట్టి చాలా మంది దీన్ని తీసుకుంటూ ఉంటారు. ఇది అంత తియ్యగా ఉండదు కాబట్టి జ్యూస్ రూపంలో తీసుకుంటారు. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ర్బూజలో నీటిపాళ్లతో పాటు ఖనిజ లవణాలూ ఎక్కువ. అందుకే వేసవిలో తీసుకుంటే డీహైడ్రేషన్ ప్రమాదం నుంచి కాపాడుతుంది.దీనిలో పీచుపదార్థాలు చాలా ఎక్కువ. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు పేగులనూ ఆరోగ్యంగా ఉంచుతుంది.దీనిలో పీచు ఎక్కువ, తీపి తక్కువ. అందుకే డయాబెటీస్ రోగులకు చాలా మేలు చేస్తుంది. దీని పీచు మలబద్దకాన్ని నివారిస్తుంది.ఆకలిలేమితో బాధపడేవారికి కర్బూజ ఒక స్వాభావికమైన ఔషధంగా పనిచేసి ఆకలిని పెంచుతుంది.అసిడిటీని అరికడుతుంది. అల్సర్ వంటి సమస్యలను నివారిస్తుంది.కర్బూజలో ఉండే విటమిన్ సితో వ్యాధినిరోధకతను సమకూర్చి ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందఐరన్ పాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత నుంచి కాపాడుతుంది.కర్బూజలో క్యాల్షియం, పాస్పరస్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే ఎముకలను దృఢపరచి, ఆస్టియోపోరోసిస్ వంటి అనేక వ్యాధులను నివారిస్తుంది.