కొందరు రాజకీయ కుటుంబం నుంచి వారసులుగా వచ్చి రాణిస్తున్నారు. కొందరేమో విద్యార్థి నాయకులుగా అంచలంచెలుగా ఎదిగి రాజకీయాలు చేస్తున్నారు. ఇకపోతే కొందరు సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చి తమ కరిజ్మా చూపిస్తారు.కానీ, ఎలాంటి రాజకీయానుభవం లేని పలువురు వ్యాపారవేత్తలు ఈ సారి లోక్ సభ ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
*వ్యాపారులకే టీఆర్‘ఎస్’
ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థుల జాబితాల్లో ఎక్కువగా వ్యాపారస్థుల పేర్లే కనిపిస్తున్నాయి. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రధాన పార్టీలు వ్యాపారులనే అభ్యర్థులుగా ఎంచుకున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు , మైనిం గ్ వ్యాపారులు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నడిపేవారు… ఇలా చాలామంది ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. ఈసారి టీఆర్ఎస్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువమంది వ్యాపారవేత్తలు బరిలో ఉన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి వ్యాపారస్థులుగా ఉన్న సిట్టిం గ్ ఎంపీలకు తిరిగి టిక్కెట్ కేటాయించగా.. మొదటిసారి పోటీచేస్తున్న వారిలో ఎక్కువగా బిజినెస్ పర్సన్స్ కే కేటాయించింది టీఆర్ఎస్. మొత్తంగా చూస్తే రాష్ర్టంలోని 17లోక్ సభ స్థానాల నుంచి8 టిక్కెట్లు వ్యాపారాలతో అనుబంధం ఉన్నవారికే కట్టబెట్టింది టీఆర్ఎస్.ఇందులో ముగ్గురు సిట్టిం గ్ ఎంపీలు వ్యాపారస్థులు కాగా కొత్తగా ఆరుగురు ఇండస్ట్రియలిస్టులకు ఎంపీ సీట్లు కేటాయించింది.
*మల్కాజ్ గిరిలో..
మల్కాజ్ గిరి ఎంపీగా తొలిసారి పోటీ చేస్తున్నమర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్ఎల్ఆర్ విద్యాసంస్థలకు మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈయన మంత్రి మల్లారెడ్డి అల్లుడు. రాజకీయానుభవంలేదు. చేవెళ్ల స్థానం నుంచి పోటీచేస్తున్న రంజిత్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త. పౌల్ట్రీ, రియల్ఎస్టేట్ తో పాటు పలు వ్యాపారాల్లో రంజిత్ రెడ్డి పేరు గాంచారు. రాజేశ్వర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేతగా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. కొన్నే ళ్లుగా టీఆర్ఎస్ తో అనుబంధంగా ఉండటంతో ఈ సారి కేసీఆర్ అతనికి చేవెళ్ల టిక్కెట్ కేటాయించారు.
*మహబూబ్ నగర్ లో..
మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచిఈసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నమన్నె శ్రీనివాస్ రెడ్డి ఫార్మా బిజినెస్ లో ఉన్నారు.ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో ఆయన కూడాభాగస్వామి. నవాబుపేట మండలం గురుకుంటగ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి కొన్నే ళ్లుగా టీ-ఆర్ఎస్ తో అనుబంధంగా ఉన్నా.. మొదటిసారిఎన్ని కల్లో పోటీ చేస్తున్నారు.. గతంలో ఎంపీటీ-సీగా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి.. ఆ తర్వాత డైరెక్ట్ఎంపీగా పోటీ చేస్తున్నారు.
*ఖమ్మంలో..
ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రూప్ కి ఈయనే అధినేత. మొదట కేటీపీఎస్ కార్మాగారంలో కాంట్రాక్టు కార్మికునిగా పని చేసి తర్వాత చిన్న చిన్న పనులు తీసుకొని కాంట్రాక్టర్ గా మారారు. అనంతరం గ్రానైట్ రంగంలో అడుగు పెట్టి విదేశాలకు కూడా ఎగుమతి చేసి రాణించారు. అలాగే మధుకానే పేరిట నిర్మాణ సంస్థను స్థాపిం చి అనతి కాలంలోనే జాతీయ, అంతర్జా తీయ స్థాయిలో ప్రాజెక్టులుచేశారు. తమ నుంచి డబ్బులు తీసుకుని.. తిరిగిచెల్లించలేదని మధుకాన్ కంపెనీని డీఫాల్టర్ గా కూడా కొన్ని బ్యాంకులు గుర్తించాయి.
*నల్గొండలో..
నల్గొండ టీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేస్తున్న వేంరెడ్డి నర్సింహారెడ్డి కూడా వ్యాపారవేత్తే. మునుగోడుకి చెందిన నర్సిం హారెడ్డి బిల్డర్ గా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. హైదరాబాద్ లోని రాజధాని కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా, స్నేహిత ఆగ్రో బయోటెక్ ఎండీగా ఉన్నారు. అలాగే 2012 నుంచి వీజీఎస్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా పనిచేశారు. హైదరాబాద్ పరిసరాల్లో వందల ఎకరాల్లోభూములు ఆయనకున్నాయి.
*జహీరాబాద్లోక..
జహీరాబాద్ ఎంపీగా కొనసాగుతున్న బీబీపాటిల్ మళ్లీ పోటీలో ఉన్నారు. ఆయన వ్యాపారాలు ఎక్కువగా మహారాష్ట్రలో నే కొనసాగుతున్నాయి.రాజకీయాల్లోకి రాకముందు ఆయన బడా వ్యాపారవేత్త.. సోదరుడు మల్లికార్జున్ తో కలిసి పుణే, ఔరంగాబాద్ లో కన్ స్ట్రక్షన్ గ్రూప్ పేరిట వ్యాపారాలున్నాయి. జాతీయ రహదారుల నిర్మాణం,అపార్ట్ మెంట్స్ నిర్మాణాలు చేస్తున్నారు.
మెదక్ లో..
మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రవాణా రంగంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రభాకర్ రెడ్డి 2007 నుంచిటీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఏపీ తెలంగాణల్లో ప్రముఖ రవాణా సంస్థ సోనీ ట్రావెల్స్ కి కొత్త ప్రభాకర్ రెడ్డి ఓనర్.
చేవెళ్లలో..
చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బడా వ్యాపారవేత్తనే. విదేశాల్లో ఇంజినీరింగ్ చదివిన విశ్వేశ్వర్ రెడ్డి పలు ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేశారు. విదేశాల్లోనూ అనేక కంపెనీలను ఏర్పాటు చేశారు. 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి గెలిచిన ఆయన ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన నుంచి ఆయన వ్యాపారాలను ఆయన భార్య చూసుకుంటున్నారు.
భువనగిరిలో..
భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కూడా పలు వ్యాపారాలున్నాయి. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి తో కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ కంపెనీ వీరికి చెందినదే. సాగునీటి కాంట్రాక్టు తో పాటు మైనింగ్ బిజినెస్ కూడా చేస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కలతో పాటు మహబూబ్ నగర్ లో తనకున్న ల్యాండ్ లోరియల్ ఎస్టేట్ చేస్తున్నారు. వివిధ వ్యాపారాల్లో సక్సెస్ అయిన వీరందరిలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.
తెలంగాణా ఎంపీ అభ్యర్థుల్లో బడా బడా వ్యాపారులు
Related tags :