1. ఏప్రిల్‌లో తితిదే ఉత్సవాలు
తిరుమలేశుడి ఆలయంలో ఏప్రిల్ మాసంలో జరిగే విశేష పర్వదినాల వివరాలను తితిదే ప్రకటించింది. ఈనెల 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 6న శ్రీవికారినామ సంవత్సర ఉగాది ఆస్థానం, 8న మత్స్య జయంతి, 10న మధురకవి ఆళ్వార్ ఉత్సవం, 14న శ్రీరామనవమి, 15న శ్రీరాములవారి పట్టాభిషేక ఆస్థానం, 17 నుంచి 19 వరకు శ్రీవారి వసంతోత్సవాలు, 23 నుంచి 27 వరకు శ్రీవరాహస్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ, 30న శ్రీభాష్యకారుల ఉత్సవాలు ఆరంభం అవుతాయని ఓ ప్రకటనలో వెల్లడించింది.
2. సామరస్యమే అభిమతం -ఒకే గుడిలో శివుడు, ఏసుక్రీస్తుకు పూజలు
మత సామరస్యానికి ఆదర్శనీయ ఉదాహరణగా నిలుస్తోంది.. కర్ణాటక, గోవాల సరిహద్దుల్లోని బెళగావి బైల్ హోంగ్లా తాలుకా దేశనూరులో ఉన్న ఈ ఆలయం. మతం, మానవత్వం కలగలిసిఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ మందిరానికి అనేక విశిష్టతలున్నాయి. 16వ శతాబ్దం నాటి ఈ ఆలయం లోపల ఒకేచోట శివుడికి, ఏసుక్రీస్తుకు భక్తులు పూజలు జరుపుతుంటారు. బయటనుంచి చూస్తే చర్చి రూపంలో.. లోపలికి వెళితే హిందూ ఆలయంలాగా ఉండటం విశేషం. ఈ మందిరంలో క్రైస్తవ ఫాదర్లు మెడలో రుద్రాక్ష మాలలు, నుదుటన విభూతిని ధరిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో ఓ ప్రాథమిక పాఠశాల, అనాథ శరణాలయాన్ని సైతం నిర్వహిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడేవారికి ఆయుర్వేద మందుల్ని కూడా అందిస్తున్నారు. కొన్ని వందల ఏళ్ల క్రితం సెయింట్ జాన్ పింటో అనే క్రైస్తవ ఫాదర్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఇక్కడికొచ్చే క్రైస్తవ ఫాదర్లు హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్ని అనుసరిస్తుంటారు. గ్రామస్థులంతా భక్తిశ్రద్ధలతో ఇద్దరు దేవుళ్లకూ పూజలు చేస్తారు.
3. 6న శ్రీవారికి ఆర్జిత సేవలు రద్దు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఏప్రిల్ 6న పలు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది. శ్రీవికారి నామ సంవత్సర ఉగాది ఆస్థానం పురస్కరించుకుని శ్రీవారికి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవాన్ని రద్దు చేస్తూ దేవస్థానం నిర్ణయం తీసుకుంది. వేకువ జామున స్వామివారికి సుప్రభాత సేవానంతరం ఆలయ శుద్ధి చేపట్టి ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారితో పాటు విష్వక్సేనుల వారిని బంగారు వాకిలి ఎదుటకు వేంచేపు చేయనున్నారు. ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ, నూతన వస్త్రాల ధరింపు, పంచాంగ శ్రవణం వంటి కార్యక్రమాలు ఆస్థానంలో భాగంగా జరగనున్నాయి.
4. కొమురవెల్లిలో భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాల కార్యక్రమం
కొమురవెల్లిలో భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాల కార్యక్రమం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నిగుండాలతో మల్లన్నస్వామి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అగ్నిగుండాలు దాటేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొమురవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
5. నేడు తిరుమల శ్రీవారి ఆలయ శుద్ధి
శ్రీవికారినామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టనుంది. తెలుగు సంవత్సరాది రోజున ఆలయంలో ఉగాది ఆస్థానం జరగనుంది. ఈ వేడుక నేపథ్యంలో ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలంతో శుద్ధి క్రతువు నిర్వహించనున్నారు. ఉదయం శ్రీవారి సుప్రభాతం, తోమాల, అర్చన సేవల అనంతరం భక్తులకు దర్శనాన్ని నిలిపివేస్తారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు తిరుమంజనం జరుగుతుంది. అనంతరం శ్రీవారి మూలవిరాట్టుకు అర్చకులు ఆగమోక్తంగా పూజాదికాలు పూర్తిచేశాక సర్వదర్శనం ప్రారంభిస్తారు.
6.అందుబాటులో 444 ఆర్జిత సేవా టిక్కెట్లు
ఆర్జిత సేవా టిక్కెట్లు ఏప్రిల్ మాసానికి సంబంధించి 444 వరకు అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్ డిప్ పద్ధతిలో కొందరు భక్తులు గుత్తగా టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు గుర్తించిన తితిదే.. నిబంధనల మేరకు వాటిని రద్దు చేసింది. కరెంటు బుకింగ్ కోటాలోకి మళ్లించింది. భక్తులు తిరుమలలో ఒకరోజు ముందు వీటిని లక్కీ డిప్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తోమాల 218, అర్చన 117, వస్త్రాలంకరణ సేవ 10, అభిషేకం 99 టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.
7.మల్లన్న స్మరణతో మోగిన కొమురవెల్లి
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం తెల్లవారుజామున ‘అగ్నిగుండాల ప్రవేశం’తో ముగిశాయి. భక్తులు చేసిన ‘జై మల్లన్న’ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. స్వామివారి కల్యాణం దరిమిలా ప్రారంభమైన జాతర దీర్ఘకాలం కొనసాగి, రాత్రి జాగరణతో మరింత సందడి సంతరించుకుంది. ఇందులో ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. తోటబావి వద్ద కొత్తగా నిర్మించిన కల్యాణ మండపం ఎదురుగా అగ్నిగుండాలు ఏర్పాటయ్యాయి. వాటిని దాటడానికి పలువురు పోటీపడ్డారు. అదనపు సీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ మహేందర్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు
8. తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఉగాది పండగను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని శుద్ధి చేస్తుంది. ఉగాది ఆస్థానం నేపథ్యంలో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేశారు.
9. తిరుమల, 2019 ఏప్రిల్ 1 -ఏప్రిల్‌లో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలు
ఏప్రిల్ 2 – శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
ఏప్రిల్ 6 – శ్రీ వికారి నామ సంవత్సరం ఉగాది.
ఏప్రిల్ 8- శ్రీ మత్స్య జయంతి.
ఏప్రిల్ 10 – శ్రీ మధురకవి ఆళ్వార్ ఉత్సవం.
ఏప్రిల్ 14 – శ్రీ రామనవమి
ఏప్రిల్ 15 – శ్రీ రాములవారి పట్టాభిషేక ఆస్థానం
ఏప్రిల్ 17 నుండి 19వ తేదీ వరకు – శ్రీవారి వసంతోత్సవాలు
ఏప్రిల్ 23 నుండి 27వ తేదీ వరకు – శ్రీ వరాహస్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ
ఏప్రిల్ 30 – శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం
10. చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 2
1725 : వెనిస్ కు చెందిన ఒక సాహసికుడు మరియు రచయిత గియాకోమో కాసనోవా జననం (1798).
1872 : అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త సామ్యూల్ F. B. మోర్స్ మరణించాడు (జ. 1791).
1915 : తెలుగు సినిమా మరియు రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు మరియు నేపధ్యగాయకుడు కొచ్చర్లకోట సత్యనారాయణ జననం (మ.1969).
1969 : భారత సినీ నటుడు అజయ్ దేవగన్ జననం.
1933 : ప్రముఖ క్రికెట్ ఆటగాడు మహారాజా రంజిత్ సింహ్‌జీ మరణించాడు(జ.1872). ఈయన పేరిటే భారత్ లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు.
1972 : చార్లీ చాప్లిన్ అమెరికా కు తిరిగి వచ్చాడు
2011 : భారత్ టీం ( టీమిండియా ) 28 ఏళ్ళ కలను సాకారం చేసుకుని ప్రపంచ కప్ గెలుచుకుంది.
11. శుభమస్తు
తేది : 2, ఏప్రిల్ 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : మంగళవారం
పక్షం: కృష్ణ (బహుళ) పక్షం
తిథి : ద్వాదశి
(నిన్న ఉదయం 6 గం॥ 5 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 8 గం॥ 37 ని॥ వరకు)
నక్షత్రం : శతభిష
(నిన్న రాత్రి 9 గం॥ 54 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 48 ని॥ వరకు)
యోగము : శుభము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 45 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 30 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 37 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 26 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 39 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 56 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 51 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 14 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 46 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 10 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 29 ని॥ లకు
సూర్యరాశి : మీనము
చంద్రరాశి : కుంభము
12. శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ వికారినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టిటిడి ఘనంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయంలో ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన లేపనంతో ఆలయగోడలకు పూశారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు అత్యంత పవిత్రంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆష్టదళపాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది. ఇతర ఆర్జిత సేవలు యధాతథంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జెఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్, విఎస్‌వో మనోహర్ ఇతర అధికారులు పాల్గొన్నారు
13. వెయ్యి కిలోల స్వర్ణాలయం
బంగారంతో కట్టిన ఆలయం అనగానే అందరికీ అమృతసర్ లోని స్వర్ణదేవాలయం గుర్తుకు వస్తుంది. కానీ రాజస్థాన్ లో మరో స్వర్ణదేవాలయం ఉంది. అమృత్ సర్‌లోని ఏడువందల కిలోల బంగారం వాడితే ఈ దేవాలయం కోసం వెయ్యి కిలోల బంగారం వాడారు.19వ శతాబ్దంలో అజ్మీర్ దీనిని కట్టించాడు. దీని నిర్మాణానికి వెయ్యి కిలోల బంగారం వాడారు. వెండి, రంగురాళ్లు కూడా ఉపయోగించారు. ఈ గుడి మొదటి అంతస్తులో ఉండే ఒక గదిని స్వర్ణనగరి అని పిలుస్తారు. ఎందుకంటే, ఈ గదిలో ఉండే ప్రతి వస్తువును బంగారంతో తయారు చేశారు.జైన మతానికి చెందిన ఈ ఆలయంలో జైన ప్రవక్తలు సాధించిన విజయాలు,వారి జీవితాలు, జైనుల ఆచారాలు, సంప్రదాయాలు.. అన్నీ శిల్పాలుగా చెక్ కారు. బయట నుం చి చూస్తే ఈ దేవాలయం ఎరుపు రంగులో కనిపిస్తుంది. అందుకే దీనిని లాల్ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో మూలవిరాట్ అధినాథ్ ను జైనులు వాళ్ల సంప్రదాయ పద్ధతి ప్రకారం పూజిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో 82 అడుగుల ఎత్తైన వృక్ష స్తంభం ఉంది. అయితే ఈ దేవాలయం జైనుల్లోని దిగంబర శాఖకు చెందింది. దొంగలు ఒకసారి దీనిని ధ్వంసం చేసినా అజ్మీర్ మళ్లీ నిర్మించాడు.
ఏప్రిల్‌లో తితిదే ఉత్సవాలు
Related tags :