????????????☘?????????☘???????????????☘????????????
* తెదేపా అభ్యర్థులే లక్ష్యంగా రాష్ట్రంలో ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా కడప జిల్లా మైదుకూరు తెదేపా అభ్యర్థి, తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈయన ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు. వైఎంఆర్ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో రెండు బృందాలు సుమారు గంట నుంచి సోదాలు కొనసాగిస్తున్నాయి. ఐటీ అధికారులు వచ్చిన సమయంలో పుట్టా సుధాకర్‌యాదవ్ నివాసంలో లేరు. ఆయన మైదుకూరు ఎన్నికల ప్రచారానికి వెళ్లినట్టు సమాచారం. ఇంట్లో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఉండటంతో వారి సమక్షంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. కడప నుంచి వెళ్లిన ఐటీ అధికారి మహదేశ్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలోనే తనిఖీలు చేస్తున్నట్టు అధికారులు చెప్పినట్టు సమాచారం.
* అరుణాచల్ ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో కోటి 80 లక్షలు పట్టివేత!
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కాన్వాయ్‌లో రూ. 1.8 కోట్లు పట్టుబడటం సంచలనం రేపుతున్నది. మంగళవారం అర్ధరాత్రి జరిపిన తనిఖీల్లో ఈ డబ్బు బయటపడింది. దీంతో ఈశాన్యంలో బీజేపీ ఓట్లకు నోట్లు పంచుతున్నదంటూ కాంగ్రెస్ ఆరోపించింది. సీఎం పెమాఖండు, డిప్యూటీ సీఎం చౌనా మేతోపాటు ప్రధాని నరేంద్ర మోదీపైనా కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. పసిఘాట్‌లో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. బుధవారం ఉదయమే అక్కడ ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ నిర్వహించడం విశేషం. దీంతో ఈశాన్య ఓటర్లను డబ్బు ఆశ చూపించి బీజేపీ వలలో వేసుకుంటున్నదని సూర్జేవాలా ఆరోపించారు.
* పశ్చిమ గోదావరి జిల్లాలో డమ్మీ ఈవీఎంలు కలకలం సృష్టించాయి. కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. 350 డమ్మీ ఈవీఎంలు పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు వ్యాన్‌లో తరలిస్తుండగా పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ డమ్మీ ఈవీఎంలను జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. పోలవరంలో వైకాపాకు చెందిన ఓ నాయకుడికి కొన్ని డమ్మీ ఈవీఎంలను అప్పగించి మిగతావి విశాఖ జిల్లాకు తరలిస్తున్నట్టు నిందితులు చెప్పినట్టు సమాచారం.
* లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేపు సాయంత్రం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇల్లందు రోడ్డులో ఏర్పాటు చేసిన మైదానంలో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల నుంచి భారీ జన సమీకరణే లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణులు ముందుకు సాగుతున్నారు.
* ఈసారి వర్షాలు సాధారణం కన్నా తక్కువే ఉంటాయని స్కైమెట్ వాతావరణ సంస్థ వెల్లడించింది. ప్రతి ఏడాది జూన్‌లో ఈశాన్య రుతుపవనాలు కేరళలో ప్రవేశించే విషయం తెలిసిందే. ఆ తర్వాతే రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. అయితే ఈ ఏడాది సాధారణ వర్షంపాతం కన్నా తక్కువే వానలు ఉంటాయని స్కైమెట్ చెప్పింది. లాంగ్ పీరియడ్ రేంజ్(ఎల్‌పీఏ)లో రుతుపవనాల ప్రభావం 93 శాతం ఉంటుందని ఆ సంస్థ అంచనా వేసింది. వర్షపాతం 90 నుంచి 95 శాతం ఉందంటే, అది బిలో నార్మల్ రేంజ్ అని ఆ సంస్థ పేర్కొన్నది. 1951 నుంచి 2000 సంవత్సరం వరకు ఎల్‌పీఏ వర్షపాతం సగటున 89 సెంటీమీటర్లు ఉన్నది. ఎల్ నినో ప్రభావం వల్లే వర్షపాతం ఈసారి నార్మల్ కన్నా తక్కువగా ఉంటుందని స్కైమెట్ సీఈవో జతిన్ సింగ్ తెలిపారు.
* ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయపన్ను శాఖ సోదాలు కలకలం రేపాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు బుధవారం దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రొద్దుటూరులోని పుట్టా నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పుట్టా పోటీ చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్‌ఏ1 కాంట్రాక్టర్‌గా ఉన్నారు. ఐటీ దాడులతో టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
*ఎన్నికల నేపద్యంలో అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ మొత్తంలో డబ్బు పట్టుబడుతోంది. ఇవాళ అబ్దుల్లాపూర్ మేట పీఎస్ పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. బీఎండబ్ల్యు కారులో తరలిస్తున్న రూ. 48 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్ధి డబ్బులు తరలిస్తున్న జూబ్లీహిల్స్ కి చెందిన శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
*హైదరాబాద్ లో నేటి రాత్రి నుంచి ప్లై ఓవర్లను మూసివేస్తున్నట్లు నగర పోలీసు కమీషనరు అంజనీ కుమార్ తెలిపారు. జగ్ నే రాత్ కార్యక్రమంలో భాగంగా ముస్లీంలు ఇవాళ రాత్రి ప్రార్ధనలు చేయనున్నారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు బుధవరం రాత్రి 10 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున వరకు గ్రీన్ లాండ్స్ ప్లై ఓవర్, లంగర్ హౌస్ పీవీఎన్నార్ ప్లై ఓవర్ మినహా నెక్లెస్ రోడ్డుతో సహా ప్రత్యామ్యాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
* మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సిక్కిరెడ్డి- ప్రణవ్ చోప్రా జోడీ ముందంజ వేసింది. మంగళవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి- ప్రణవ్ జంట 22-20, 24-22తో సామ్ మాగీ- క్లోయ్ మాగీ (ఐర్లాండ్) జోడీపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత యువ ఆటగాడు సమీర్‌వర్మ 20-22, 23-21, 12-21తో రెండో సీడ్ షి యుకి (చైనా) చేతిలో పోరాడి ఓడాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప 20-22, 21-17, 20-22తో బేక్ హా- కిమ్ రిన్ (కొరియా) చేతిలో పరాజయం చవిచూశారు.
* టెక్నో మొబైల్స్ తన నూతన స్మార్ట్ ఫోన్ కామన్ ఐ4 ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.9599 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.
* ఐపీఎల్ కోసం భారత్‌కు వచ్చిన శ్రీలంక స్టార్ ఫాస్ట్‌బౌలర్ లసిత్ మలింగ స్వదేశానికి వెళ్లిపోనున్నాడు. ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఈ పేసర్‌కు లీగ్‌లో ఆడేందుకు మొదట లంక బోర్డు నుంచి అనుమతి లభించింది. అయితే ఇప్పుడు బోర్డు ఆలోచన మారింది. దేశవాళీ వన్డే టోర్నీ ఆడేందుకు అతడిని మళ్లీ వెనక్కి పిలిపిస్తోంది. ఈ సీజన్లో మలింగ ఇక కనిపించడు. బుధవారమే అతను స్వదేశానికి వెళ్లనున్నాడు. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని స్వదేశంలో ఏప్రిల్ 4న ప్రారంభమయ్యే సూపర్ ప్రొవిన్సియల్ వన్డే టోర్నీలో అతణ్ని ఆడించాలని లంక బోర్డు నిర్ణయించింది. ఈ టోర్నీలో తలపడే గాలె జట్టుకు మలింగ సారథ్యం వహించనున్నాడు.
* తమ దేశంలో ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపి వేయాలని పాకిస్థాన్ నిర్ణయించింది. ఈ టోర్నీ వల్ల తమ దేశంలో క్రికెట్‌కు నష్టం వాటిల్లుతుందని పాక్ చెప్పింది. ‘‘పాకిస్థాన్‌లో క్రికెట్‌కు హాని కలిగించడానికి భారత్ వ్యవస్థీకృత ప్రయత్నం చేస్తుంది. భారత దేశవాళీ క్రికెట్ టోర్నీని మా దేశంలో ప్రసారం కానీయం’’ అని పాక్ సమాచార మంత్రి ఫవాద్ తెలిపాడు. పుల్వామా దాడుల తర్వాత పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రసారాలను డీస్పోర్ట్ ఆపేసిన సంగతి తెలిసిందే. అంతేకాక పీఎస్‌ఎల్‌ను ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ప్రసారం చేయడానికి ఒప్పుకున్న భారత కంపెనీ ఐఎంజీ రిలయన్స్ ఆ ఒప్పందం నుంచి మధ్యలోనే వైదొలిగింది.
*విజయవాడ తుమ్మలపల్లి క్షెత్రయ్య కళాక్షెత్రంలో మంగళవారం జరిగిన ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం 20,21 వ స్నాతకొత్సవంలో వైద్య పట్టభద్రుడు లింగమనేని ప్రశాంత తొమ్మిది బంగారు పతకాలతో మెరిశారు. సిబార్ దంత వైద్య కళాశాల డీన్ కృష్ణప్రసాద్ కుమారుడు ప్రశాంత్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పరిధి మంగళగిరిలోని ఎన్నారై కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. ఇదేళ్ళకు రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ విద్యార్ధిగా ఐదు బంగారు పతకాలు సాధించారు. వీటితోపాటు మరో నాలుగు నలుగు బంగారు పతకాలు వివిధ విభాగాల కింద అందుకున్నారు. ప్రశాంత్ ప్రస్తుతం చికాగోలోని ప్రఖ్యాత కింగ్ కౌంటీ ఆసుపత్రిలో ఇంతర్నార్ మెడిసిన్ లో రెసిడెన్సీ కోర్సు చేస్తున్నారు. ఆయన తరపున తండ్రి, తాతలు డాక్టర్ లింగమనేని కృష్ణప్రసాద్, సుబ్బారావు మంగళవారం తొమ్మిది స్వర్ణ పతకాలను ఉపకులపతి డాక్టర్ సీవీ.రావు నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్ ఎక్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ డాక్టర్ వీ.ఎస్.చౌహాన్ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రశాంత్ తండ్రితో పాటు తాత కూడా వైద్యుడే.
*దేశవ్యాప్తంగా వేతన జీవులకిది శుభవార్త. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు పదవీవిరమణ సమయంలో అధిక పింఛను పొందేందుకు సుప్రీంకోర్టు వీలుకల్పించింది.
*ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం చేసిన చట్టం తెలంగాణలోనూ అమలుకానుంది. దీనికింద ఆయా వర్గాలకు ‘ఇన్‌కం-అసెట్స్ సర్టిఫికెట్’ పేరుతో ఆదాయం-స్థిరాస్తుల ధ్రువపత్రం ఇచ్చేందుకు రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పత్రాలు జారీచేసే అధికారాన్ని తహసీల్దార్లకు కల్పించింది. ఆయావర్గాలను గుర్తించేందుకు వీలుగా పలు మార్గదర్శకాలను భూపరిపాలనప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) జారీచేశారు.
*ఎన్నికల వేళ నకిలీ వార్తలపై చర్యలకు సామాజిక మాద్యమం ‘వాట్సాప్’ నడుం బిగించింది. వినియోగదారులు తాము అందుకునే సమాచారంలో ప్రామాణికతను తనిఖీ చేసుకునేందుకు వీలు కల్పించే ‘చెక్‌పాయింట్ టిప్‌లైన్’ను మంగళవారం ఆవిష్కరించింది.
*రాత్రి వేళలో రహదారులపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసుల కోసం హైదరాబాద్ నగర పోలీసులు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వారికి ‘ఎల్‌ఈడీ షోల్డర్ లైట్ల’ను అందజేస్తున్నారు. రాత్రి వేళ విధులు నిర్వర్తించేవారు వీటిని భుజాలకు తగిలించుకుంటే అవి వెలుగులీనుతుంటాయి. దీంతో వాహనదారులు దూరం నుంచే చీకట్లోని పోలీసులను గుర్తించే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు.
*ఆయన రాష్ట్ర డీజీపీ. పోలీసు దళాలకు అధిపతి. ఎన్నికల వేళ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితులను పరిశీలించేందుకు ప్రైవేటు వాహనాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. ఎన్నికల విధుల్లో భాగంగా వాహనాల తనిఖీ చేపడుతున్న బృందాలు ఆయన వాహనాన్ని కూడా క్షుణ్నంగా తనిఖీ చేసి నిబంధనల ముందు అందరూ సమానమేనని నిరూపించాయి.
*నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని నర్సాపూర్ వాసులు సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. తమ గ్రామాన్ని అధికారులు పంచాయతీగా గుర్తించాలని, అది జరగకుంటే ఈ నెల 11న పోలింగ్‌లో పాల్గొనబోమని తీర్మానించారు. ఆ మేరకు పత్రాన్ని వారు మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో సమర్పించారు. ఆచన్‌పల్లి పంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామాన్ని ఇటీవలే మున్సిపాలిటీలో విలీనం చేయడం, దీన్ని వ్యతిరేకిస్తూ గ్రామవాసులు ఆందోళన సాగించడం తెలిసిందే.
*తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ)కి ఇసుక ఆదాయం భారీగా వచ్చింది. 2018-19 సంవత్సరానికి ఇసుక విక్రయాలతో రూ.886.42 కోట్లు గడించింది. అంతకుముందు సంవత్సరం (2017-18)లో రూ.678.35 కోట్ల ఆదాయం పొందింది. దీంతో ఇసుక అమ్మకాల ద్వారా సంపాదించింది 30 శాతానికి పైగా పెరిగినట్లయిందని సంస్థ మంగళవారం ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత- టీఎస్‌ఎండీసీతో ఆన్‌లైన్‌లో ఇసుక అమ్మకాల వల్ల ప్రభుత్వానికి మొత్తంమీద రూ.2,415.35 కోట్ల ఆదాయం లభించింది.
*తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ) సభ్య కార్యదర్శి పి.సత్యనారాయణరెడ్డి పదవీకాలాన్ని పొడిగించారు. ఇది ఈ నెలాఖరువరకు వర్తిస్తుందని.. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రప్రభుత్వం పేర్కొంది.
* ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ- రేపల్లె-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలుకు అదనపు ఏసీ బోగీని ఏర్పాటు చేస్తున్నట్లు సీనియర్ మండల వాణిజ్య అధికారి వాసుదేవరెడ్డి మంగళవారం తెలిపారు. ఈనెల 5వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కాచిగూడ-రేపల్లె మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు(నం.17625)కు 3వ తరగతి ఏసీ బోగీని అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
*తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ)కి ఇసుక ఆదాయం భారీగా వచ్చింది. 2018-19 సంవత్సరానికి ఇసుక విక్రయాలతో రూ.886.42 కోట్లు గడించింది. అంతకుముందు సంవత్సరం (2017-18)లో రూ.678.35 కోట్ల ఆదాయం పొందింది.
*హెచ్‌సీయూ (హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం) దూరవిద్య కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఏప్రిల్ 10వ తేదీ వరకు పెంచింది. పీజీ కోర్సులు, డిప్లొమో కోర్సులను దూరవిద్య విధానంలో హెచ్‌సీయూ అందిస్తోంది.
* తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యక్రమాలు మరింత విస్తృతమవుతున్నాయి. సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్-హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్ చెరువుల పరిరక్షణపైనా దృష్టి సారించడం విదితమే. ఇప్పుడు మురికివాడల ప్రజలకు వైద్యం అందించడానికి కూడా సిద్ధమయ్యారు.
*నూతన ఆవిష్కరణల కేటగిరీలో ప్రధానమంత్రి పురస్కారానికి తెలంగాణ పురపాలకశాఖ పంపించిన ‘పట్టణాల్లో ఆస్తుల మ్యాపింగ్’ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కాఫీటేబుల్ పుస్తకంగా ముద్రించేందుకు ఎంపికచేసింది.
*టెరిటోరియల్ ఆర్మీలో పోస్టుల (జీడీ, ట్రేడ్స్‌మన్, క్లర్క్) భర్తీకి సంబంధించి షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఈనెల 7న కామన్ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు రక్షణశాఖ, పౌర సంబంధాల శాఖ అధికారులు ప్రకటించారు.ఆర్కేపురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఈ పరీక్షలకు అభ్యర్థులు ఉదయం 7 గంటలలోపు హాజరుకావాలని సూచించారు. తమ వెంట అడ్మిట్‌కార్డుతో పాటు ప్రభుత్వం జారీచేసిన గుర్తింపు కార్డును తీసుకురావాలని, ఇతర వివరాలకు 78893 70124, 98496 88119 నôబర్లలో సంప్రదించాలని తెలిపారు.
* కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వర్సిటీ ఉపాధ్యక్షుడు హవీష్ లక్ష్మణ్ కోనేరు తెలిపారు.
* మహారాష్ట్రలోని ఓ పంటపొలాల్లో 5 చిరుత పులి పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. పూణేలోని జూనార్‌లో ఆలాసరి గ్రామంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ చెరుకు తోటలో పంటకోయడానికి వచ్చిన కూలీలు 5 చిరుత పులి పిల్లల మృతదేహాలను గుర్తించారు. ‘పొలంలోని చెత్తను ఒక్కచోటుకి తెచ్చి కాల్చమని యజమాని చెప్పారు. చెత్తను ఒక్క చోట తెచ్చి వేస్తుండగా అందులో ఐదు చిరుత పులి పిల్లల మృతదేహాలు ఉన్నట్టు ఓ మహిళా కూలి గుర్తించింది’ అని పొలంలో పని చేయడానికి వచ్చిన వ్యక్తి చెప్పాడు.
* అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలు, రైతుల శ్రేయస్సు గురించి తపన పడేవారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. జిల్లాలోని మాడుగుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా చీడికాడలో రోడ్‌షోలో ఆమె పాల్గొని ప్రసంగించారు. రైతుల ప్రాణాలంటే చంద్రబాబుకు ఎన్నడూ లెక్కలేదని విమర్శించారు. గతంలో జరిగిన ఒక సంఘటనను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.
పుట్టా సుధాకర్ ఇంటిపై ఐటీ దాడులు–తాజావార్తలు–04/03
Related tags :