ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్కైమేట్ సంస్థ పేర్కొంది. దేశంలో వాతవరణ వివరాలు వెల్లడించే ఏకైక ప్రైవేటు రంగ సంస్థ ఇదే. ‘పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే పెరిగిపోనుంది. మార్చి నుంచి మే మధ్యలో ఎల్‌నినో ఏర్పడటానికి 80శాతం అవకాశం ఉంది. అదే జరిగితే జూన్-ఆగస్టు నెలలో 60శాతం తగ్గుదల నమోదవుతుంది. ఫలితంగా రుతుపవనాల కాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది’’ అని స్కైమేట్ ఎండీ జతిన్ సింగ్ వెల్లడించారు. భారత్‌లో రుతుపవనాల కాలంలో 70 శాతం పైగా వర్షపాతం నమోదైతే పంటలకు పెద్దగా ఇబ్బంది ఉండదు.
ఈ ఏడాది తక్కువ వర్షాలు
Related tags :